Abn logo
Mar 2 2021 @ 20:05PM

12వ అంతస్తు నుంచి పడిపోయిన చిన్నారి.. రక్షించిన డ్రైవర్..

వియత్నాం: వియత్నాంలో ఘోర ప్రమాదం నుంచి బాలిక తృటిలో తప్పించుకుంది. వియాత్నంలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని 12వ అంతస్తు బాల్కనీ నుంచి పడిపోయిన 2 ఏళ్ల చిన్నారిని డెలివరీ డ్రైవర్ పట్టుకున్నాడు.


12వ అంతస్తు బాల్కనీలో నుంచి పడిపోయిన రెండేళ్ల బాలికను డెలివరీ డ్రైవర్ సరైన సమయానికి స్పందించి రక్షించాడు. డెలివరీ చేయడానికి తన కారులో కూర్చున్న డ్రైవర్ ఒక చేత్తో బాల్కనీ అంచున అతుక్కున్న అమ్మాయిని పట్టుకోవడానికి వాహనం నుంచి దిగాడు. అదృష్టవశాత్తూ శిశువు తన ఒడిలో పడిందని డెలివరీ డ్రైవర్ పేర్కొన్నాడు.

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement
Advertisement