Gurgaon Hottest Day...5 రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు...ఐఎండీ హెచ్చరిక

ABN , First Publish Date - 2022-04-29T15:52:12+05:30 IST

దేశంలోని పలు రాష్ట్రాల్లో వేడిగాలులు వీస్తున్నాయి.పలు రాష్ట్రాల్లో గురువారం నుంచి అధిక ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు అవస్థల పాలయ్యారు....

Gurgaon Hottest Day...5 రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు...ఐఎండీ హెచ్చరిక

న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో వేడిగాలులు వీస్తున్నాయి.పలు రాష్ట్రాల్లో గురువారం నుంచి అధిక ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు అవస్థల పాలయ్యారు. అసలే వేడి గాలులు ఆపై కరెంటు కోతలతో ప్రజల కష్టాలు మరింత పెంచాయి.గురుగ్రామ్ నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 45.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఢిల్లీ నగరంలో గురువారం ఉష్ణోగ్రత 43.5 డిగ్రీలుంది. వేడిగాలుల ప్రభావంతో గురుగ్రామ్ వాసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత పెరిగింది. ఢిల్లీలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత గత 12 సంవత్సరాలలోనే అత్యధికమని ఐఎండీ అధికారులు చెప్పారు.రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, యూపీ, ఒడిశా రాష్ట్రాల్లో హీట్ వేవ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.


‘‘వచ్చే మూడు రోజుల్లో వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు దాదాపు 2 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉంది’’ అని భారత వాతావరణ శాఖ తెలిపింది.హీట్‌వేవ్ ప్రభావిత ప్రాంతాల్లో శిశువులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు ఆరోగ్య సమస్యల బారిన పడతారని ఐఎండీ తెలిపింది.ఏప్రిల్ 28 నుంచి దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో హీట్ వేవ్ కోసం ఎల్లో అలర్ట్ హెచ్చరిక జారీ చేశారు.ఉష్ణోగ్రతలు పెరగడంతో దేశ రాజధాని, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ డిమాండ్ కూడా గణనీయంగా పెరిగింది. గురువారం తొలిసారిగా ఢిల్లీలో విద్యుత్ డిమాండ్ 6,000 మెగావాట్ల మార్కును దాటింది.రాజస్థాన్ కర్మాగారాలకు నాలుగు గంటల విద్యుత్ కోత విధించారు. 


Updated Date - 2022-04-29T15:52:12+05:30 IST