DTUలో బీటెక్‌ లేటరల్‌ ఎంట్రీ

ABN , First Publish Date - 2022-06-20T21:21:51+05:30 IST

ఢిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ(Delhi University of Technology) (డీటీయూ) - బీటెక్‌ ప్రోగ్రామ్‌లో లేటరల్‌ ఎంట్రీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కామన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌(Common Entrance Examination) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి రెండో ఏడాది ప్రోగ్రామ్‌లో అడ్మిషన్స్‌ ఇస్తారు...

DTUలో బీటెక్‌ లేటరల్‌ ఎంట్రీ

ఢిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ(Delhi University of Technology) (డీటీయూ) - బీటెక్‌ ప్రోగ్రామ్‌లో లేటరల్‌ ఎంట్రీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కామన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌(Common Entrance Examination) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి రెండో ఏడాది ప్రోగ్రామ్‌లో అడ్మిషన్స్‌ ఇస్తారు. ఇంజనీరింగ్‌ విభాగాలన్నింటిలో కలిపి మొత్తమ్మీద 96 సీట్లు ఉన్నాయి. అభ్యర్థులు తమ ఆసక్తి మేరకు ఇంజనీరింగ్‌ విభాగాన్ని ఎంచుకోవచ్చు.


ఇంజనీరింగ్‌ విభాగాలు: బయోటెక్నాలజీ, ప్రొడక్షన్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌, ఇంజనీరింగ్‌ ఫిజిక్స్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ - ఆటోమోటివ్‌ ఇంజనీరింగ్‌, మేథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌

అర్హత: ఏదేని స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఎస్‌బీటీఈ) / ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఏదేని ఇంజనీరింగ్‌ విభాగంలో మూడేళ్ల రెగ్యులర్‌ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ప్రథమ శ్రేణి మార్కులు తప్పనిసరి. 

ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ వివరాలు: దీనిని ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో 90 మల్టిపుల్‌ చాయిస్‌  ప్రశ్నలు ఇస్తారు. మేథమెటిక్స్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ అంశాలనుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున మొత్తం మార్కులు 360. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే ఒక మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. పరీక్ష సిలబస్‌ కోసం సంస్థ వెబ్‌సైట్‌ చూడవచ్చు. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.1500

దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 4

కామన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (సీఈఈ) తేదీ: జూలై 11న

అభ్యర్థుల మెరిట్‌ లిస్ట్‌ విడుదల: జూలై 12న

మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌: జూలై 18న

రెండో రౌండ్‌ కౌన్సెలింగ్‌: జూలై 27

స్పాట్‌ అడ్మిషన్స్‌: ఆగస్టు 5న

వెబ్‌సైట్‌:  www.dtu.ac.in

Updated Date - 2022-06-20T21:21:51+05:30 IST