Traffic signal : ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు చూసి.. చూపు తిప్పుకోలేకున్న వాహనదారులు.. వాటెన్ ఐడియా అంటున్న నెటిజన్లు..

ABN , First Publish Date - 2022-07-18T02:57:24+05:30 IST

Traffic signals వద్ద చాలా మంది ఆపకుండా వేగంగా దూసుకెళ్తుంటారు. ఎన్ని జరిమానాలు విధించినా కొందరు యువకులు మాత్రం సిగ్నల్ జంపింగ్ చేస్తూనే ఉంటారు. ఓ వైపు చలాన్లు..

Traffic signal : ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు చూసి.. చూపు తిప్పుకోలేకున్న వాహనదారులు.. వాటెన్ ఐడియా అంటున్న నెటిజన్లు..

Traffic signals వద్ద చాలా మంది ఆపకుండా వేగంగా దూసుకెళ్తుంటారు. ఎన్ని జరిమానాలు విధించినా కొందరు యువకులు మాత్రం సిగ్నల్ జంపింగ్ చేస్తూనే ఉంటారు. ఓ వైపు చలాన్లు పేరుకుపోతున్నా.. ట్రాఫిక్ నిబంధనలు మాత్రం పాటించరు. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు వివిధ రకాలుగా అవగాహన కల్పిస్తుంటారు. కొందరు ట్రాఫిక్ పోలీసులు డ్యాన్సు చేస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం.. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. సిగ్నల్ జంపింగ్ సమస్యకు చెక్ పెట్టేందుకు ఢిల్లీ పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. దీంతో పలువురు వాహనదారులు వావ్! సూపర్ ఐడియా అని అంటున్నారు..


Traffic signals వద్ద వాహనదారులు నిబంధనలు అతిక్రమించకుండా ఉండేందుకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. రెడ్ లైటులో కరీనా కపూర్ వీడియోను ప్లే చేశారు. గతంలో కరీనా కపూర్ నటించిన చిత్రంలోని ఓ Dialogue అందులో వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ‘‘ఎవరు వారు.. నన్ను చూసి కూడా వెనక్కు తిరిగి చూడకుండా వెళ్తున్నారు’’.. అని కరీనా కపూర్ చెప్పే డైలాగ్ వీడియోను రెడ్ లైట్‌లో ప్రదర్శిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వాహనదారులను బాగా ఆకట్టుకుంటోంది. వేగంగా వెళ్తున్న కారును.. పక్కనే రెడ్ రైడ్‌లో కరీనా కపూర్ మాట్లాడుతున్నట్లుగా ఉన్న వీడియోను, ఢిల్లీ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.





Updated Date - 2022-07-18T02:57:24+05:30 IST