Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ చైర్మన్‌ పరిమి హనుమంతరావు మృతి

పాయకాపురం, అక్టోబరు 22 : నిడమానూరు గ్రామ మాజీ సర్పంచ్‌, గొల్లపూడి మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌-విజయవాడ చైర్మన్‌ పరిమి హనుమంతరావు శుక్రవారం తెల్లవారుజామున నిడమానూరులోని ఆయన నివాసంలో మృతిచెందారు. హనుమంతరావు 1942, మార్చి 15న జన్మించారు. విజయవాడ పరిసర ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో 2007వ సంవత్సరంలో పీహెచ్‌ఆర్‌ ఇన్వెంట్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీని స్థాపించి, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ సొసైటీ వారి ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ను నిడమానూరులో ఏర్పాటు చేశారు. నిడమానూరు గ్రామ ప్రజలు, విజయవాడలోని వివిధ పాఠశాలల ప్రతినిధులు, బంధువులు, మిత్రులు, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ బోధన, బోధనేతర సిబ్బంది హనుమంతరావు భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన కుమారులు పరిమి నరేంద్రబాబు, కోటేశ్వరరావు, కుమార్తె ఉషారాణిని పరామర్శించారు. శుక్రవారం ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌కు సెలవు ప్రకటించారు. 

Advertisement
Advertisement