Abn logo
Jan 26 2021 @ 21:28PM

ఢిల్లీ ఆందోళనలో 83 మంది పోలీసులకు గాయాలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళనలో 83 మంది పోలీసులు గాయపడ్డారు. వీరంతా వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చాలామంది పోలీసులకు తలలు పగిలిపోయాయని ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రి సీఎంఓ తెలిపారు. మరోవైపు ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో 15 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించాలని నిర్ణయించారు. ఢిల్లీలో పలు చోట్ల ఆందోళనకారులు పోలీసులపై కర్రలతో, తల్వార్లతో దాడి చేశారు. ఢిల్లీ రవాణాశాఖకు చెందిన ఆర్టీసీ బస్సుల అద్దాలు పగులగొట్టారు. ఎర్రకోటపైకి ఎక్కి జెండాలు ఎగురవేశారు. మరోవైపు రైతుల ఆందోళన హింసాత్మకంగా మారడంతో పార్లమెంట్, రాష్ట్రపతి భవన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేశారు. ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేశారు. మరోవైపు తమ ఆందోళనలోకి అసాంఘిక శక్తులు చొరబడ్డాయని రైతు సంఘాల ఐక్యవేదిక నాయకుడు రాకేశ్ తికాయత్ ఆరోపించారు. 

Advertisement
Advertisement
Advertisement