ఢిల్లీ పోలీసులు నా బట్టలు చింపేశారు: మహిళా ఎంపీ

ABN , First Publish Date - 2022-06-16T17:23:35+05:30 IST

ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ఈ చర్య దారుణం. మహిళా నిరసనకారులతో ఇలా వ్యవహరించడం ప్రతి భారతీయ మర్యాదకు అవమానం. అలాంటిది లోక్‌సభ ఎంపీకే ఇలా జరగడం మన ప్రమాణాలను ఎంత తక్కువ తీసుకెళ్తున్నారో అర్థం అవుతోంది. ఢిల్లీ పోలీసుల ప్రవర్తనను ఖండిస్తున్నాను. స్పీకర్ ఓంబిర్లా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను..

ఢిల్లీ పోలీసులు నా బట్టలు చింపేశారు: మహిళా ఎంపీ

న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులు తన బిట్టలు చింపేశారంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మహిళా ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సభ్యులపై పోలీసులు ఇలా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణించాలంటూ లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఆమె విజ్ణప్తి చేశారు. తమిళనాడుకు చెందిన జోతిమణి అనే ఎంపీ ఆవేదన ఇది. మనీ ల్యాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని మూడు రోజులుగా ఈడీ విచారిస్తోంది. అయితే దీనిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. చాలా చోట్ల అరెస్ట్‌లు నిర్బంధాలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల లాఠీ చార్జీల వంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఢిల్లీలో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ సందర్భంలోనే పోలీసులు తన బట్టలు చింపేశారంటూ జోతిమణి పేర్కొన్నారు.


‘‘పోలీసులు మాపై భీకర దాడకి పాల్పడ్డారు. వాళ్లు నా బట్టలు చింపేశారు. నా బూట్లు తొలగించారు. నన్ను ఒక క్రమినల్‌లాగ తీసుకెళ్లారు’’ అని జోతిమణి అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘‘ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ఈ చర్య దారుణమే. మహిళా నిరసనకారులతో ఇలా వ్యవహరించడం ప్రతి భారతీయ మర్యాదకు అవమానం. అలాంటిది లోక్‌సభ ఎంపీకే ఇలా జరగడం మన ప్రమాణాలను ఎంత తక్కువ తీసుకెళ్తున్నారో అర్థం అవుతోంది. ఢిల్లీ పోలీసుల ప్రవర్తనను ఖండిస్తున్నాను. స్పీకర్ ఓంబిర్లా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’’ అని ట్వీట్ చేశారు.

Updated Date - 2022-06-16T17:23:35+05:30 IST