Abn logo
Sep 17 2020 @ 06:26AM

ఢిల్లీ మెట్రో ఇంద్రధనుస్సులో చేరిన 10వ రంగు... ఫేజ్-4 కలర్ కోడ్ ఇదే!

న్యూఢిల్లీ: కరోనా కాలంలో ఢిల్లీ మెట్రో ఇంద్రధనుస్సులో 10వ రంగు జతచేరింది. ఢిల్లీ మెట్రో తన ఫేజ్-4కు చెందిన 3 కారిడార్లకు లైన్ నంబర్, కలర్ కోడ్‌లను ప్రకటించింది. తుగ్లకాబాద్-ఎరోసిటీ(లైన్-10)కి సిల్వర్ లైన్ గా నామకరణం చేశారు. అలాగే మజ్లిస్ పార్క్- మౌజ్‌పుర్ (లైన్-7) పింక్ లైన్ ఎక్స్‌టెన్షన్‌గా మారనుంది. అదేవిధంగా జనక్‌పురి వెస్ట్-ఆర్కే ఆశ్రమం రూట్... లైన్-8గా మారనుంది. దీనిని మెజెంటాలైన్ ఎక్స్‌టెన్సన్ పేరుతో పిలవనున్నారు.

కరోనా వ్యాప్తి చెందకుండా ఢిల్లీ మెట్రో పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారి మంగూ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ మెట్రోలోని ఫేజ్-4కు చెందిన స్టేషన్ల వద్ద ఇప్పటికే ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్(ఏఎఫ్సీ) కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ స్టేషన్లలో నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్(ఎన్సీఎంసీ) పనిచేయనుంది. దీనితోపాటు ప్రయాణికులు తమ సెల్‌ఫోన్ల ఆధారంగా స్టేషన్లలోకి రాకపోకలు సాగించగలుగుతారు. ఫలితంగా కార్డు లేదా టోకెన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కరోనా కారణంగా కొన్ని నెలల పాటు మూతపడిన ఢిల్లీ మెట్రో ఇటీవలే పరుగులు అందుకుంది.

Advertisement
Advertisement
Advertisement