Money laundering case: మంత్రి సత్యేంద్ర జైన్‌కు హైకోర్టులో చుక్కెదురు

ABN , First Publish Date - 2022-10-01T21:56:52+05:30 IST

మనీ లాండరింగ్ కేసు (Money laundering case)లో ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌ (Satyendra jain)కు రాష్ట్ర హైకోర్టులో..

Money laundering case: మంత్రి సత్యేంద్ర జైన్‌కు హైకోర్టులో చుక్కెదురు

న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసు (Money laundering case)లో ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌ (Satyendra jain)కు రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. తనపై ఉన్న మనీలాండరింగ్ కేసును మరో కోర్టుకు బదిలీ చేస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ జైన్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు శుక్రవారంనాడు తోసిపుచ్చింది. కేసును బదలీ చేసే విషయంలో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి వాస్తవాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్నారని, అందులో చట్టవిరుద్ధం ఏమీ లేదని, జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని జస్టిస్ యోగేష్ అన్నారు. ఇది కేవలం పిటిషనర్ భయాలకు సంబంధించిన విషయంగానే తాము భావిస్తూ పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని అన్నారు.


సత్యేంద్ర జైన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుపుతున్న గీతాంజలి గోయెల్ నుంచి కేసును వేరు జడ్జికి బదిలీ చేయాలని ఈడీ ఇటీవల విజ్ఞప్తి చేసింది. దీంతో ఈ కేసును ప్రత్యేక న్యాయమూర్తి వికాస్ ధుల్‌ ముందుకు ప్రిన్సిపల్ అండ్ జిల్లా అండ్ సెస్షన్ జడ్జి వినయ్ కుమార్ గుప్తా సెప్టెంబర్ 23న బదిలీ  చేశారు. ఈ నిర్ణయాన్నే సత్యేంద్ర జైన్ హైకోర్టులో సవాలు చేశారు. అందుకు సంబంధించిన పిటిషన్‌ను హైకోర్టు శనివారంనాడు తోసిపుచ్చింది. అవినీతి నిరోధక చట్టం కింద సత్యేంద్రజైన్‌పై 2017లో సీబీఐ ఎఫ్ఐర్ నమోదు చేయగా, మనీలాండరింగ్ అభియోగంపై మంత్రిని, మరో ఇ్దదరిని ఈడీ అరెస్టు చేసింది.

Updated Date - 2022-10-01T21:56:52+05:30 IST