పర్యావరణ నష్టపరిహారం చెల్లించాలని డీడీఏని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు

ABN , First Publish Date - 2020-08-13T21:22:03+05:30 IST

తుపాను నీటి పారుదల వ్యవస్థకు నష్టం కలిగించినందుకు పరిహారం చెల్లించాలని

పర్యావరణ నష్టపరిహారం చెల్లించాలని డీడీఏని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ : తుపాను నీటి పారుదల వ్యవస్థకు నష్టం కలిగించినందుకు పరిహారం చెల్లించాలని ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ)ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. రూ.50 లక్షలు ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ) వద్ద జమ చేయాలని ఆదేశించింది. జస్టిస్ నవీన్ చావ్లా ధర్మాసనం ఈ నెల 10న ఈ ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల్లోగా ఈ నష్ట పరిహారాన్ని జమ చేయాలని తెలిపింది. 


డీడీఏ వాదనపై స్పందించాలని డీపీసీసీకి నోటీసు జారీ చేసింది. తదుపరి విచారణ 2020 నవంబరు 20న జరుగుతుందని తెలిపింది. 


నైరుతి ఢిల్లీలోని సమల్ఖ-ద్వారక రోడ్డులో ఏర్పాటు చేసిన తుపాను నీటి పారుదల వ్యవస్థకు నష్టం కలిగించినట్లు డీపీసీసీ ఆరోపించింది. రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డీడీఏను జూలై 10న ఆదేశించింది. ఈ నష్టపరిహారం విధింపును డీడీఏ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. 


తుపాను నీటిలో నాణ్యతను పరిశీలించేందుకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు డీపీసీసీ తెలిపింది. అయితే జరిమానా విధించే అధికారం డీపీసీసీకి లేదని డీడీఏ వాదిస్తోంది. 


Updated Date - 2020-08-13T21:22:03+05:30 IST