10 ఏళ్లు పూర్తి చేసుకున్న డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌ రద్దు

ABN , First Publish Date - 2021-12-16T23:22:31+05:30 IST

10 ఏళ్లు పూర్తి చేసుకున్న డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌ రద్దు

10 ఏళ్లు పూర్తి చేసుకున్న డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌ రద్దు

న్యూఢిల్లీ: జనవరి 1 నాటికి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న అన్ని డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా జనవరి 1 2022 నాటికి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న అన్ని డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర ప్రాంతాల్లో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌వోసీ) ఉన్న వాహనాలకు తిరిగి మళ్లీ రిజిస్ట్రేషన్ చేయనున్నారు. 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న డీజిల్ వాహనాలకు ఎన్‌వోసీ ఇవ్వకూడదని ఢిల్లీ రవాణా శాఖ నిర్ణయించింది. నేషనల్ గ్రీన్ ట్రైబునల్ ఆదేశాల ప్రకారం ఢిల్లీ పరిధిలో 10 ఏళ్లకు పైబడిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్ల పాత పెట్రోల్ వాహనాల కోసం రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేస్తున్న వాహనాదారులకు పై నిబంధనలు వర్తించనున్నాయి.

Updated Date - 2021-12-16T23:22:31+05:30 IST