Advertisement
Advertisement
Abn logo
Advertisement

రావణ దహనం చూసి తీరాల్సిందే!

దేశ రాజధాని ఢిల్లీలో దసరా వేడుకలు ఘనంగా జరుపుకొంటారు. ఆలయాలను సుందరంగా అలంకరిస్తారు. ఇక రామ్‌లీలా మైదానంలో జరిగే వేడుకలు చూసి తీరాల్సిందే. వేల మంది ప్రజలు ఈ వేడుకలు చూసేందుకు వస్తుంటారు. అతి పెద్ద రావణుడి బొమ్మ తయారుచేసి రావణ దహనం కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల వేళ ప్రజలు తొమ్మిది రోజుల పాటు ఉపవాసాలు ఉంటారు. రామ్‌లీలా నాటకం చూడటం మధురానుభూతిని పంచుతుంది. అక్కడక్కడా దుర్గామాత మండపాలు ఏర్పాటు చేస్తారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ దసరా ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకొంటారు.

Advertisement
Advertisement