ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఈడ్చుకెళ్లిన కారు డ్రైవ‌ర్

ABN , First Publish Date - 2020-10-15T17:35:49+05:30 IST

దేశరాజధాని ఢిల్లీలో ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్ కానిస్టేబుల్ నుంచి త‌ప్పించుకునే ప్రయత్నంలో ఓ కారు డ్రైవ‌ర్ బరితెగించాడు. వాహ‌నాన్ని ఆపిన ఆ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను కారుతో బలంగా ఢీకొట్టి, కారును వేగంగా...

ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఈడ్చుకెళ్లిన కారు డ్రైవ‌ర్

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్ కానిస్టేబుల్ నుంచి త‌ప్పించుకునే ప్రయత్నంలో ఓ కారు డ్రైవ‌ర్ బరితెగించాడు. వాహ‌నాన్ని ఆపిన ఆ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను కారుతో బలంగా ఢీకొట్టి, కారును వేగంగా ముందుకు పోనిచ్చేప్రయత్నం చేశాడు. అయితే కారులో ఉన్న ఆ డ్రైవ‌ర్ దిగివ‌స్తాడ‌ని ట్రాఫిక్ కానిస్టేబుల్ భావించాడు. కానీ ఆ డ్రైవర్ కారును త‌న మీదకు ఎక్కించే ప్ర‌య‌త్నం చేయ‌డంతో కానిస్టేబుల్ కంగుతిన్నాడు.



వెంట‌నే తేరుకొని కారు బానెట్‌ను ప‌ట్టుకొని జాగ్రత్తగా ఉన్నాడు. కొద్ది మీట‌ర్ల దూరం వ‌ర‌కు ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో పాటు కారును అలానే  డ్రైవ‌ర్ ముందుకు పోనిచ్చాడు. కొద్దిసేపటి తరువాత కానిస్టేబుల్‌ కింద‌ప‌డిపోగానే, డ్రైవర్ కారు ‌వేగం పెంచి పరారయ్యాడు. ఢిల్లీలోని దౌలాకావున్‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకోగా, సీసీ కెమెరాలో దీనికి సంబంధించిన దృశ్యాలు రికార్డ‌య్యాయి. కారు నంబరు  ఆధారంగా డ్రైవ‌ర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Updated Date - 2020-10-15T17:35:49+05:30 IST