బిగ్ రిలీఫ్: 12వ తరగతి పరీక్షల రద్దుపై కేజ్రీవాల్

ABN , First Publish Date - 2021-06-02T04:18:55+05:30 IST

రగతి బోర్డు పరీక్షలను రద్దు చేయడంతో ‘‘గొప్ప ఉపశమనం’’ దొరికినట్టైందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్

బిగ్ రిలీఫ్: 12వ తరగతి పరీక్షల రద్దుపై కేజ్రీవాల్

న్యూఢిల్లీ: 12వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేయడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయంతో విద్యార్ధులకు ‘‘గొప్ప ఉపశమనం’’ దొరికినట్టైందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్ కారణంగా సీబీఎస్‌ఈ 12వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా కేజ్రీవాల్ స్పందిస్తూ... ‘‘12వ తరగతి పరీక్షలు రద్దుకావడం పట్ల ఆనందంగా ఉంది. మన పిల్లల ఆరోగ్యం విషయమై అందరం ఆందోళన చెందాం. నిజంగా ఇదో పెద్ద ఊరట..’’ అని పేర్కొన్నారు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలు రద్దు చేసి గతేడాది మాదిరిగానే ప్రతిభ ఆధారంగా మార్కులు వేయాలని ఇవాళ ఉదయం కేజ్రీవాల్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.  

Updated Date - 2021-06-02T04:18:55+05:30 IST