కొనుగోళ్లలో జాప్యం.. అన్నదాతల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-05-17T05:53:50+05:30 IST

ముస్తాబాద్‌, మోర్రాయిపల్లె గ్రామాల్లో సోమవారం తెల్లవారు జామున కురిసిన అకా ల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడి సిపోయింది.మండల కేంద్రంలో సునూగూరి సాయిలుకు సంబంధించిన దాదాపు దాదాపు 10 క్వింటాళ్ల ధాన్యం నేలపాలు అయింది.

కొనుగోళ్లలో జాప్యం.. అన్నదాతల ఆగ్రహం
ముస్తాబాద్‌లో రాస్తారోకో చేస్తున్న రైతుల

ముస్తాబాద్‌, మే 16: ముస్తాబాద్‌, మోర్రాయిపల్లె గ్రామాల్లో సోమవారం తెల్లవారు జామున కురిసిన అకా ల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడి సిపోయింది.మండల కేంద్రంలో సునూగూరి సాయిలుకు సంబంధించిన దాదాపు దాదాపు 10 క్వింటాళ్ల ధాన్యం నేలపాలు అయింది. అధికారులు పట్టించుకోవడం లేదని మోర్రాయిపల్లె రైతులు పెద్ద ఎత్తున ముస్తాబాద్‌కు తరలివచ్చి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు.రోడ్డుపైనే వంటా వార్పు చేశారు. సీఐ ఉపేందర్‌, జిల్లా అధికారులు వచ్చి విరమింపజేసేందుకు ప్రయత్నం చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, లారీలతో ఇబ్బందులు ఉంటే ట్రాక్టర్లలో ధాన్యాన్ని తీసుకొచ్చి రైస్‌మిల్లుల్లో అమ్మాలని ఇబ్బందులు కలుగకుండా చూస్తామని డీఎస్‌వో అధికారులు పేర్కొన్నారు.   కాంగ్రెస్‌, బీజేపీ మండల అధ్యక్షులు బాల్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్‌, గజ్జెల రాజు, మహేశ్‌రెడ్డి, రాములు, సంతోష్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

తంగళ్లపల్లి: తడిసిన వరిధాన్యాన్ని  కొనుగోలు చేయాలని, రవాణాకు కేంద్రానికి నిత్యం మూడు లారీలను పంపియ్యాలని డిమాండ్‌ చేస్తూ తంగళ్లపల్లి మండలం మండెపల్లి రైతులు ఆందోళన నిర్వహించారు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి  కేంద్రాల్లోని  ధాన్యం తడిసి ముద్దయ్యింది. కేంద్రాల్లో కాంటా వేసి బస్తాల్లో నింపిన ధాన్యాన్ని మిల్లులకు తరలించక పోవ డం, ఆలస్యంగా కేంద్రాలు ప్రారంభించడం, కొనుగోళ్లు నత్త నడకన సాగుతుండడం వంటివాటితో  రైతులు తీవ్రంగా నష్ట పోయారు.  తడిసిన వరిధాన్యాన్ని రోడ్డుపై పోసి  సుమారు గంట పాటు రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, ఎంపీటీసీ భైరినేని రాము, సిరిసిల్ల వంశీ మద్దతు తెలిపారు.  . విషయం తెలుసుకున్న సీఐ ఉపేందర్‌, ఎస్సై లక్ష్మారెడ్డి ఆందోళన విరమించాలని విఙ్ఞప్తి చేసినా రైతులు ససేమిరా అన్నారు. అనంతరం  ఇబ్బందులు లేకుండా చూస్తామని డీఎస్‌వో హామీ ఇవ్వడంతో  ఆందోళన విరమించారు.  తడిసిన  ధాన్యం కొనుగోలు చేయాలని తాడురు కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేశారు.  బీజేపీ శ్రేణులు  మద్దతు తెలిపాయి.  అధికారులు  హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

చందుర్తి: ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదని వర్షంతో   కేంద్రలోని ధాన్యం తడిసి ముద్దవుతోందని  కోరుట్ల- వేములవాడ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు.  లారీల కొరతతో కొనుగోళ్లు నిలిచిపోయా న్నారు. దీంతో వర్షానికి ధాన్యం తడిసిందన్నారు. ఎస్సై శ్రీకాంత్‌ నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. తహసీల్దార్‌  నరేష్‌ చేరుకొని రైతులతో చర్చించారు.  ఫోన్‌లో పౌర సరఫరాల జిల్లా మేనేజర్‌ హరికృష్ణతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. 

లారీల సమస్య పరిష్కరిస్తాం 

లారీల కొరతతో ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై చందుర్తి తహసీల్దార్‌ కార్యాలయంలో రైతులు, ప్రజా ప్రతినిధులతో అధికారులు సమావేశమయ్యారు.  అన్ని గ్రామాలకు లారీల కొరత లేకుండా చేస్తామని, రైస్‌ మిల్లుల వద్ద ధాన్యం అన్‌ లోడింగ్‌ వెంట వెంటనే జరిగేల చర్యలు తీసుకుంటామని అన్నారు.  జిల్లా పౌర సరఫరాలు మేనేజర్‌ హరికృష్ణ, తహసీల్దార్‌ నరేష్‌, జడ్పీటీసీ నాగం కుమార్‌, ఏఎంసీ చైర్మన్‌ పొన్నాల శ్రీనివాసరావు, సింగిల్‌ విండో చైర్మన్‌ తిప్పని శ్రీనివాస్‌, కో ఆప్షన్‌ సభ్యులు బత్తుల కమలాకర్‌, లారీల కాంట్రాక్టర్‌ ఖమ్రోద్దీన్‌, నాయకుడు చిలుక పెంటయ్య, లింగాల మల్లయ్య, రవిందర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T05:53:50+05:30 IST