అర్హత కలిగిన ప్రతి పోడు రైతుకు పట్టా

ABN , First Publish Date - 2021-10-29T03:40:40+05:30 IST

అర్హత కలిగిన ప్రతి పోడు రైతుకు పట్టా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. నవంబరు 8నుంచి డిసెంబరు 8వరకు పోడు రైతుల నుంచి దరఖాస్తులను తీసుకుంటామని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు.

అర్హత కలిగిన ప్రతి పోడు రైతుకు పట్టా
కలెక్టర్‌, ఎమ్మెల్యేలకు దండారి తలపాగ పెడుతున్న ఆదివాసులు

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌, అక్టోబరు 28: అర్హత కలిగిన ప్రతి పోడు రైతుకు పట్టా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. నవంబరు 8నుంచి డిసెంబరు 8వరకు పోడు రైతుల నుంచి దరఖాస్తులను తీసుకుంటామని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌ గ్రామ పంచాయతీలోని రైతువేదికలో అదనపుకలెక్టర్‌లు రాజేశం, వరుణ్‌రెడ్డితో కలిసి జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ చట్టం-2005 ప్రకారం పట్టా పంపిణీ చేస్తామని అన్నారు. దాదాపు పదివేల వరకు పట్టాలు ఇచ్చే అవకాశం ఉందన్నారు. కమిటీ ఆధ్వర్యంలో ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ చట్టం-2005 ప్రకారం అటవీ భూముల్లో సాగుపై తనిఖీ చేసి జిల్లా కమిటీ నివేదిక అందించిన తరువాత పట్టాపంపిణీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.

అర్హులైన ప్రతి దండారికి రూ.10వేలు..

జిల్లాలోని అర్హులైన ప్రతి దండారికి రూ.10వేలు అందజేస్తామని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. గురు వారం జిల్లాలోని ఆదివాసీభవన్‌లో 24వ కుంరం సూరు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన దండారి ఉత్సవాలను ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి ప్రారం భించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన ప్రతి దండారికి రూ.10 వేలు అందజేస్తామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన శాఖ అధికారి మణెమ్మ, కొలాం సంఘం జిల్లా అధ్యక్షుడు గంగారాం, పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T03:40:40+05:30 IST