రక్షణ గోడ పనులు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-06-20T04:53:18+05:30 IST

నగరంలోని బుగ్గవంక రక్షణ గోడ ఇరుపక్కలా నిర్మిస్తున్న రోడ్డు పనులు వేగవంతం చేయాలని సబ్‌ కలెక్టర్‌ పృథ్వీతేజ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

రక్షణ గోడ పనులు వేగవంతం చేయాలి
అధికారులతో మాట్లాడుతున్న సబ్‌ కలెక్టరు పృథ్వీతేజ్‌

కడప (ఎర్రముక్కపల్లె), జూన్‌ 19 : నగరంలోని బుగ్గవంక రక్షణ గోడ ఇరుపక్కలా నిర్మిస్తున్న రోడ్డు పనులు వేగవంతం చేయాలని సబ్‌ కలెక్టర్‌ పృథ్వీతేజ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం బుగ్గవంక అధికారులు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్‌ అధికారులతో కలిసి అల్మా్‌సపేట బ్రిడ్జి నుంచి రవీంద్రనగర్‌ బ్రిడ్జి వరకు సుందరీకరణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బుగ్గవంక ఇరుపక్కలా రక్షణ గోడ అవతల నిర్మిస్తున్న 40 అడుగుల రోడ్డు వెడల్పు పనులు వేగవంతం చేయాలన్నారు. ఎక్కడైనా ఆశ్రమాలు ఉంటే వాటిని తొలగించాలని, రెవెన్యూ, మున్సిపల్‌, బుగ్గవంక అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏమైనా సమస్యలుంటే వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దారు శివరామిరెడ్డి, కార్పొరేషన్‌ ఇన్‌ఛార్జ్‌ కమిషనర్‌ రమణారెడ్డి, బుగ్గవంక ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T04:53:18+05:30 IST