హత్యకేసులో నిందితుడి అరెస్టు

ABN , First Publish Date - 2020-10-24T11:21:00+05:30 IST

తనను నమ్మి సహజీవనం చేస్తున్న కాంకూరు సుజాత(30)ను హత్య చేసి పరారీలో ఉన్న బుదూరు ప్రసాద్‌ను ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది అదుపులోకి తీసుకున్నారని రైల్వేకోడూరు సీఐ ఆనందరావు పేర్కొన్నారు.

హత్యకేసులో నిందితుడి అరెస్టు

చిట్వేలి, అక్టోబరు23 : తనను నమ్మి సహజీవనం చేస్తున్న కాంకూరు సుజాత(30)ను హత్య చేసి పరారీలో ఉన్న బుదూరు ప్రసాద్‌ను ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది అదుపులోకి తీసుకున్నారని రైల్వేకోడూరు సీఐ ఆనందరావు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పోలీసులు విలేకర్లకు సమావేశంలో హత్య కేసు సంబంధించిన వివరాలను సీఐ వెల్లడించారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంతో కలపుది గ్రామం ఎస్టీ కాలనీకి చెందిన సుజాత, అదే జిల్లా, అదే మండలం గిద్దలూరు ఎస్టీ కాలనీకి చెందిన ప్రసాద్‌ సహజీవనం చేస్తూ ఉండేవారు. వీరు కొంత కాలంగా చిట్వేలి మండలంలోని దేవమాచుపల్లెలో ఒక రైతుకు చెందిన మామిడితోటలో కాపలా ఉంటూ సంసారం సాగిస్తున్నారు.


ఈ నెల 18వ తేదీన రాత్రి 2గంటల సమయం లో ఆమెను హత్య చేసి పరారయ్యాడన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్‌ఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు ప్రసాద్‌ స్వగ్రామం వెళ్లేందుకు చిట్వేలి అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బస్సు కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం అందింది.  దీంతో ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది రవి, శామ్యుల్‌, రమే్‌ష చాకచక్యంగా నిందితుడు ప్రసాద్‌ను పట్టుకున్నారని సీఐ ఆనందరావు వివరించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్‌కానిస్టేబుల్‌ కాటయ్య, బాబు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-24T11:21:00+05:30 IST