23 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్టు

ABN , First Publish Date - 2021-07-28T06:44:20+05:30 IST

ధర్మవరం పట్టణ, రూరల్‌ పరిధిలో 23 ఏళ్ల క్రితం పలు హత్య కేసుల్లో కీలక ముద్దాయిగా ఉన్న మల్లాకా ల్వ నాగిరెడ్డిని ధర్మవరం అర్బన్‌ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు.

23 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్టు
విలేకరులకు వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ రమాకాంత్‌

పలు హత్య కేసుల్లో కీలక ముద్దాయి

బెంగళూరులో అరెస్టు చేసిన ధర్మవరం పోలీసులు

ధర్మవరం, జూలై 27: ధర్మవరం పట్టణ, రూరల్‌ పరిధిలో 23 ఏళ్ల క్రితం పలు హత్య కేసుల్లో కీలక ముద్దాయిగా ఉన్న మల్లాకా ల్వ నాగిరెడ్డిని ధర్మవరం అర్బన్‌ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. మంగళవారం డీఎస్పీ రమాకాంత్‌ స్థానిక అర్బన్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఎస్పీ ఆదేశాల మేరకు పాత కేసుల్లో ముద్దాయిగా ఉన్న ధర్మవరం మండలం మల్లాకాల్వ గ్రామానికి చెందిన నాగిరెడ్డిపై పోలీసులు నిఘా పెట్టారు. నాగిరెడ్డి ధర్మవరం అర్బన్‌పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో 2005లో ఒక హత్య కేసు, 1998, 1999 సంవత్సరాల్లో పట్టణంలో రామాంజనేయులును, రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో వెంకటరాముడును హత్య చేశాడు. వీటితో పాటు ఎన్‌బీడబ్ల్యు, ఆర్మ్స్‌యాక్ట్‌ వంటి పాతకేసులు, ఎల్‌పీసీ వారెంటు పెండింగ్‌ లో ఉంది. నాగిరెడ్డి  బెంగళూరులో చికెన్‌సెంటర్‌ నిర్వహిస్తూ అ క్కడే స్థిరపడ్డాడు. పక్కా సమాచారంతో సీఐ కరుణాకర్‌తో పాటు సిబ్బంది సోమవారం అక్కడికి వెళ్లి అరెస్టు చేసి ధర్మవరం స్టేషన్‌కు తీసుకువచ్చారు. బుధవారం కోర్టులో హాజరుపరచనున్నట్టు డీఎస్పీ తెలిపారు. సీఐ కరుణాకర్‌, హెడ్‌కానిస్టేబుల్‌ మునేనాయక్‌, కానిస్టేబుళ్లు మఽధుసూదన్‌, ప్రతాప్‌ ప్రసన్నకుమార్‌, శీనానాయక్‌లను డీఎస్పీ అభినందించారు.

Updated Date - 2021-07-28T06:44:20+05:30 IST