Deers: రోడ్డు పక్కనే వందలాది జింకలు

ABN , First Publish Date - 2022-08-20T16:29:26+05:30 IST

నీలగిరి జిల్లా(Nilgiri District)లోని ముదుమలై పులుల శరణాలయంలో రోడ్డు పక్కనే వందలాది జింకలు సంచరిస్తుండడంతో పర్యాటకులు,

Deers: రోడ్డు పక్కనే వందలాది జింకలు

                                     - పర్యాటకుల ఆనందం


పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 19: నీలగిరి జిల్లా(Nilgiri District)లోని ముదుమలై పులుల శరణాలయంలో రోడ్డు పక్కనే వందలాది జింకలు సంచరిస్తుండడంతో పర్యాటకులు, వాహనచోదకులు పరవశంగా వీక్షిస్తున్నారు. నాలుగు నెలలుగా కురుస్తున్న వర్షాలతో ప్రస్తుతం ఆ ప్రాంతమంతా పచ్చదనంతో నిండిపోయింది. దీంతో, అడవిలోని జింకలు రోడ్డు పక్కకు చేరుకొని మేత మేస్తున్నాయి. జింకలు(Deer) బెదిరేలా వాహనచోదకులు ఆ ప్రాంతంలో హారన్‌ మోగించొద్దని, వాటితో సెల్ఫీ తీసుకొనేందుకు పర్యాటకులు యత్నించొద్దని అటవీశాఖ హెచ్చరిస్తూ పలు ప్రాంతాల్లో ప్రకటన బోర్డులు ఏర్పాటుచేసింది.


Updated Date - 2022-08-20T16:29:26+05:30 IST