సమస్యలు పరిష్కరించకుంటే విధుల బహిష్కరణ

ABN , First Publish Date - 2020-08-08T07:46:29+05:30 IST

సమస్యలు పరిష్కరించకుంటే విధులు బహిష్కరిస్తామని ఏపీ జూనియర్‌ డాక్టర్ట అసోసియేషన్‌ అధ్యక్షుడు దీపక్‌చంద్‌ ప్రకటించారు.

సమస్యలు పరిష్కరించకుంటే విధుల బహిష్కరణ

జూనియర్‌ డాక్టర్‌ అసోసియేషన్‌ స్పష్టీకరణ


మహారాణిపేట, ఆగస్టు 7: సమస్యలు పరిష్కరించకుంటే విధులు బహిష్కరిస్తామని ఏపీ జూనియర్‌ డాక్టర్ట అసోసియేషన్‌ అధ్యక్షుడు దీపక్‌చంద్‌ ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కొవిడ్‌19 విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నా, ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. జనవరి నుంచి స్లైఫండ్‌ పెంచుతామని ప్రకటించినా ఇప్పటి వరకు అమల్లోకి రాలేదని, పొరుగు రాష్ట్రాల్లో ఇస్తున్నట్టు 45 శాతం అదంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


కరోనాపై యుద్ధంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా పనిచేస్తున్నామని, అందువల్ల తమకు రూ.కోటి మేరకు బీమా సదుపాయం కల్పించాలని కోరారు. అలాగే, నాణ్యమైన మాస్క్‌లు, పీపీఈ కిట్లు అందించాలన్నారు. శనివారం నుంచి నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని, కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలియజేస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే విధులు బహిష్కరిస్తామని స్పష్టం చేశారు.  

Updated Date - 2020-08-08T07:46:29+05:30 IST