కంట్రోల్‌లో కరోనా..

ABN , First Publish Date - 2020-09-27T10:55:40+05:30 IST

జగిత్యాల జిల్లాలో కరోనా వ్యాధి కొద్దికొద్దిగా కంట్రోల్‌లోకి వస్తోంది. ఆగస్టు రెండవ వారం నుంచి సెప్టెంబరు మొదటి వారం వరకు జిల్లాలో రోజుకు 300లకు పైగానే కరోనా పాజిటివ్‌ కేసులు రాగా, ఒక్కో రోజైతే ఏకంగా 500 వరకు పాజిటివ్‌ కేసులు

కంట్రోల్‌లో కరోనా..

జిల్లాలో తగ్గుతున్న పాజిటివ్‌ కేసులు

గతంలో రోజుకు 300లకు పైగానే నమోదు

వారం రోజులుగా 150లోపే..

ఇప్పటివరకు 7396 మందికి వైరస్‌

అధికారిక లెక్కల ప్రకారం 51 మంది మృతి


(ఆంధ్రజ్యోతి, జగిత్యాల)

 జగిత్యాల జిల్లాలో కరోనా వ్యాధి కొద్దికొద్దిగా కంట్రోల్‌లోకి వస్తోంది. ఆగస్టు రెండవ వారం నుంచి సెప్టెంబరు మొదటి వారం వరకు జిల్లాలో రోజుకు 300లకు పైగానే కరోనా పాజిటివ్‌ కేసులు రాగా, ఒక్కో రోజైతే ఏకంగా 500 వరకు పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. అయితే ఇప్పుడు పాజిటివ్‌ కేసుల సంఖ్య సగానికి పడిపోయింది. ఒక్కో రోజు అయితే వందలోపే పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో జిల్లావాసులు కొంతమేరకు ఊపిరి పీల్చుకుంటుండగా, మున్ముందు కూడా మాస్క్‌లు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటిస్తే జిల్లాలో ఈ వ్యాధిని పూర్తిగా అరికట్టవచ్చునని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.


జిల్లాలో తగ్గుముఖం పడుతున్న కరోనా..

జిల్లాలో కరోనా వైరస్‌ మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతున్నట్లు కే సుల సంఖ్యను బట్టి చూస్తే తెలుస్తోంది. జిల్లాలో మొదట్లో హైదరా బాద్‌, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల తర్వాత పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చాయి. అయితే సక్రమంగా పరీక్షలు చేయడం లేదని ఆరోపణలు రావడంతో జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా ల్లో, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో ర్యాపిడ్‌ టెస్టులు చేయాలని జిల్లాలో కలెక్టర్‌ రవి ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరి యా ఆస్పత్రులకు పోస్టుల సంఖ్య తగ్గవద్దని వైద్యాధికారులకు టార్గె ట్లు పెట్టారు. దీనికితోడు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు కూడా ఎక్కువ సంఖ్యలోనే చేస్తూ వచ్చారు. దీంతో జిల్లాలో ఆగస్టు రెండవ వారం నుంచి ఒ క్కసారిగా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రతి రోజు 300 లకు పైగానే పాజిటివ్‌ కేసులు కాగా, ఒక్కోసారి 400 నుంచి 500 వర కు పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో జిల్లావ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన మొదలైంది.


జిల్లాలో ఇప్పటివరకు 3667 మందికి ఆర్‌టీపీసీఆర్‌ చేయగా, 727 మందికి పాజిటివ్‌ వచ్చింది. అలాగే 62,478 మం దికి ర్యాపిడ్‌ టెస్టులు చేయగా, 6281 మందికి కాల్చి వచ్చింది. దీనికితోడు ఇతర జిల్లాల్లో 380 మందికి పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. మొత్తంగా ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 66,145 మందికి పరీక్షలు చే యగా, 7396 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇందులో 5642 మంది వ్యా ధి బారి నుంచి బయటపడగా, ప్రస్తుతం 1754 మంది చికిత్స పొందుతున్నారు. ఇందులో 51 మంది మరణించినట్లు వైద్యాధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే జిల్లాలో కేసుల సంఖ్య రోజురోజుకూ పె రుగడంతో కొన్ని రోజుల పాటు జనం ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడ్డారు. అయితే ఇప్పుడు పాజిటివ్‌ కేసుల సంఖ్య మెల్లిమెల్లిగా తగ్గతూ వస్తోంది. దీంతో జిల్లావాసులు ఊపిరి పీల్చుకుంటున్నా రు. మరణాల సంఖ్య తక్కువగానే ఉండగా, ఇటీవల మరింతగా తగ్గిపోయింది. రికవరీ రేటు కూడా జిల్లాలో ఎక్కువగానే ఉంది. పాజిటివ్‌ కేసుల వారు ఎక్కువ సంఖ్యలో హోం క్వారంటైన్‌లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. సౌకర్యాలు లేని వారి కోసం పొలాసలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో హోం క్వారంటైన్‌ ఏర్పాటు చేసినా ఎవరూ వెళ్లడం లేదు.


మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి..

కరోనా కట్టడికి మాస్కుల వాడకం, భౌతిక దూరం తప్పనిసరని వైద్యాధికారులు సూచిస్తున్నారు. అవసరాల నిమిత్తం బయటకు వెళ్లిన వారు ఉద్యోగులు, వ్యాపార సంస్థలు నిర్వహించేవారు విధిగా మాస్కు లు ధరించాలని వైద్యులు పేర్కొంటున్నారు. వీలైనంత వరకు భౌతిక దూరం పాటించాలని గుంపులు, గుంపులుగా కూర్చోకపోవడమే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


భారీగా తగ్గిన కేసులు

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ నెల 17న 118 పాజిటివ్‌ రాగా, 18న 149 మందికి, 19న 125 మందికి, 20న 89 మందికి, 21న 137 మందికి, 22న 139 మందికి, 23న 98 మం దికి, 24న 109 మందికి, 25వ తేదీన 152 మందికి పాజిటివ్‌ వచ్చింది.


కేసుల సంఖ్య తగ్గుతుంది..: డాక్టర్‌ శ్రీధర్‌, జిల్లా వైద్యాధికారి, జగిత్యాల

జిల్లాలో కేసుల సంఖ్య కొంతమేరకు తగ్గుముఖం పట్టింది. గతంతో పోలిస్తే సగానికంటే ఎక్కువగానే పాజిటివ్‌ కేసులు తగ్గిపోయాయి. ఒకప్పుడు 300లకు పైగా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఇప్పుడు 150లోపే పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. జిల్లాలో రికవరీ రేటు కూడా ఎక్కువగానే ఉంది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు పాజిటివ్‌ వచ్చినవారికి ఎప్పటికప్పుడు ఆరోగ్య సూచనలు ఇస్తున్నాం.

Updated Date - 2020-09-27T10:55:40+05:30 IST