వడల అలంకారంలో ఆంజనేయుడు
మార్కాపురం(వన్‌టౌన్), మే 24: స్థానిక కంభం రోడ్డులోని నాగులపుట్ట వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమజ్జయంతి ఉత్స వాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళ వారం స్వామివారికి 2116 వడలతో వడమాల సేవ నిర్వహించారు. అర్చకులు త్రివిక్రమా చార్యులు, ఆంజనేయుని మూలవిరాట్‌కు సుప్రభాతసేవ, పంచామృత స్నపన నిర్వహిం చారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు నిర్వహించారు.
నేటి నుంచి హనుమజ్జయంతి వేడుకలు
మార్కాపురం, మే 24: మార్కాపురం మండలంలోని బోడుచర్లలో ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు హనుమజ్జయంతి వేడుకులు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు మంగళవారం తెలిపారు. 25న రామనామ మంత్రం, 26న అష్టోత్తర శతనామా పూజలు, 27న వెంకటేశ్వరస్వామి వారి కల్యాణం, 28న అష్టోత్తర శతనామా పూజలు, 29న ఆకుపూజ, 30న మంగళహారతి, మహానివేదన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు 30న భక్తులకు అన్నదానం చేయనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ నిర్వహాకులు కోరారు.