అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-07-25T05:44:27+05:30 IST

అప్పులబాధతో గంట్యాడ గ్రామానికి చెంది న తాటిపూడి సన్యాసి (49) శనివారం ఉరివేసుకుని ఆత్మ హత్యకు పాల్పడ్డాడు.

అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య

గంట్యాడ: అప్పులబాధతో గంట్యాడ గ్రామానికి చెంది న తాటిపూడి సన్యాసి (49) శనివారం ఉరివేసుకుని ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించి స్థానికులు అం దించిన వివరాలు ఇలా ఉన్నాయి. కుమ్మరి వృత్తి చేసుకునే జీవనోపాధి పొందున్న సన్యాసి కొన్నేళ్ల కిందట గంట్యాడ నుంచి కొటారుబిల్లికి వలస వచ్చాడు. ఇక్కడ కొంత భూమిని లీజుకు తీసుకుని ఇటుకలు తయారు చేసి విక్రయించే వారు. గణపతి, దేవీ నవ రాత్రుల సమయంలో విగ్రహాలు తయారు చేసి విక్రంచేవాడు. ఈ క్రమంలో శని వారం ఉదయం ఐదు గంటల సమయంలో నిద్రలేచి తన భార్యను టీ పెట్టమని చెప్పి, బయటకు వెళ్లారు. తిరిగి ఎంతకీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు బయ టకు వెళ్లి చూసేసరికి సన్యాసి మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ఉన్నారు. వెంటనే కిందికి దించి పరిశీలించినా.. అప్పటికే అతడు మృతి చెందారు. మృతుడి కుమా రుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంట్యాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా సుమారు రూ.40లక్షలు అప్పు ఉండడంతో తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.  



Updated Date - 2021-07-25T05:44:27+05:30 IST