Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 30 2021 @ 11:01AM

Ecuador:జైలులో ఖైదీల మధ్య ఘర్షణ..116 మంది మృతి

52 మందికి గాయాలు

ఈక్వెడార్: ఈక్వెడార్ దేశంలోని పెనిటెన్షియారియా డెల్ లిటోరల్ జైలులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో 116 మంది మరణించారు. ఈక్వెడార్ జైలు కాంప్లెక్సులో ఖైదీలు తుపాకులు, గ్రనేడ్లతో ఘర్షణ పడ్డారు. మెక్సికన్ డ్రగ్స్ ముఠాల వల్ల ఖైదీల మధ్య ఘర్షణ జరిగిందని జైలు అధికారులు చెప్పారు.జైలులో జరిగిన అల్లర్లలో 116 మంది మరణించారని, వీరిలో ఆరుగురిని శిరచ్ఛేదం చేశారని నేషనల్ ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది. జైలులో అల్లర్లను నియంత్రించేందుకు వచ్చిన పోలీసుల్లో ఇద్దరు గాయపడ్డారు.

 జైలు అధికారులపై ఖైదీలు దాడి చేశారు.ఈ అల్లర్లలో మరో 80 మంది ఖైదీలు గాయపడ్డారు.ఈక్వెడార్ జైలులో ఫిబ్రవరిలో జరిగిన ఘర్షణలో 79 మంది, జులైలో జరిగిన ఘటనలో 22 మంది మరణించారు.గతంలో జైలులో జరిగిన హింసాకాండను ఇంటర్-అమెరికన్ కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ ఖండించింది. జైలు హింసపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి, బాధ్యులను శిక్షించాలని ఈక్వెడార్ ప్రభుత్వాన్ని హ్యూమన్ రైట్స్ వాచ్ కోరింది.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement