లాక్‌డౌన్‌ వల్ల మరణాలు సగానికి తగ్గుతాయి

ABN , First Publish Date - 2020-04-03T09:19:24+05:30 IST

లాక్‌డౌన్‌ వల్ల భారతదేశంలో కరోనా మరణాలు 50 శాతం తగ్గుతాయని ప్రముఖ కార్డియాలజిస్టు దేవీ ప్రసాద్‌ శెట్టి గురువారం అన్నారు. ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్‌ కాలపరిమితి ముగిశాక మళ్లీ...

లాక్‌డౌన్‌ వల్ల మరణాలు సగానికి తగ్గుతాయి

  • 21 రోజుల తర్వాత దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అవసరం లేదు
  • వైరస్‌ తీవ్రత ఎక్కువున్న చోట వేగంగా పరీక్షలు చేయాలి
  • ప్రముఖ కార్డియాలజిస్టు దేవీ ప్రసాద్‌ శెట్టి

బెంగళూరు, ఏప్రిల్‌ 2: లాక్‌డౌన్‌ వల్ల భారతదేశంలో కరోనా మరణాలు 50 శాతం తగ్గుతాయని ప్రముఖ కార్డియాలజిస్టు దేవీ ప్రసాద్‌ శెట్టి గురువారం అన్నారు. ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్‌ కాలపరిమితి ముగిశాక మళ్లీ దేశమంతా లాక్‌డౌన్‌ను అమలు చేయాల్సిన అవసరం లేదన్నారు. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న  ప్రాంతాలకే లాక్‌డౌన్‌ను పరిమితం చేస్తూ సాధ్యమైనంత ఎక్కువగా పరీక్షలు నిర్వహించి బాధితులను గుర్తించాలన్నారు. ఈ రెండు, మూడు వారాల్లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అయితే దేశంలో వైరస్‌ వ్యాప్తి నియంత్రణలోనే ఉందన్నారు. లాక్‌డౌన్‌ వల్ల దేశంలో కరోనా కేసులు 83 శాతం తగ్గుతాయని యూపీలోని శివనాడార్‌ వర్సిటీకి చెందిన పరిశోధకులు అభిప్రాయపడ్డారు.


Updated Date - 2020-04-03T09:19:24+05:30 IST