Karnataka పాఠశాల మధ్యాహ్న భోజనంలో బల్లి..80 మంది విద్యార్థులకు అస్వస్థత

ABN , First Publish Date - 2021-12-28T18:12:18+05:30 IST

పాఠశాల మధ్యాహ్న భోజనంలో మరణించిన బల్లి ప్రత్యక్షమైన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హావేరి జిల్లాలో వెలుగుచూసింది....

Karnataka పాఠశాల మధ్యాహ్న భోజనంలో బల్లి..80 మంది విద్యార్థులకు అస్వస్థత

హవేరి (కర్ణాటక): పాఠశాల మధ్యాహ్న భోజనంలో మరణించిన బల్లి ప్రత్యక్షమైన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హావేరి జిల్లాలో వెలుగుచూసింది.  వెంకటాపురం తండా గ్రామ ప్రభుత్వ పాఠశాలలో బల్లి కలిసిన భోజనం తిన్న 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను రాణిబెన్నూర్ పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు.అధికారుల నిర్లక్ష్యం వల్లనే పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో బల్లి పడిందని, ఈ ఘటనపై దర్యాప్తు జరిపి కారకులపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారులు ఆదేశించారు.చికిత్స అనంతరం చిన్నారులు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు పాఠశాల అధికారులు తెలిపారు.గతంలో తమిళనాడులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పురుగులతో కూడిన కుళ్లిన గుడ్లు బయటపడ్డాయి. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా కోడిగుడ్లను పంపిణీ చేయగా, అందులో పురుగులు వెలుగుచూశాయి.


Updated Date - 2021-12-28T18:12:18+05:30 IST