మృత్యువాత పడుతున్న చేపలు

ABN , First Publish Date - 2021-04-13T04:34:56+05:30 IST

చెరువుల్లో ఉన్న కొద్దిపాటి నీరు అడుగంటి పోవ డంతో చేపలు మృత్యువాత పడుతున్నాయి.

మృత్యువాత పడుతున్న చేపలు
చనిపోయిన చేపలను బయటకు తీస్తున్న మత్స్యకారులు

 - ఆందోళనలో మత్స్యకారులు 

పెద్దమందడి, ఏప్రిల్‌ 12:  చెరువుల్లో ఉన్న కొద్దిపాటి నీరు అడుగంటి పోవ డంతో చేపలు మృత్యువాత పడుతున్నాయి. దాంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. కేఎల్‌ఐ నుంచి పెద్దమందడి పెద్ద చెరువుకు రావాల్సిన సాగు నీరు సరిగా రాలేదు. పంట చేతికి వస్తుందోలేదోనని ఉన్న నీరును పొలాలకు రైతులు తరలిస్తుండడంతో చెరువు అడుగంటి చేపలు చనిపోతున్నాయని మత్స్య కారులు వాపోతున్నారు.  తాము పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. 

 చేపల వల చుట్టుకొని మత్స్యకార్మికుడి మృతి

కొత్తకోట:  చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్య కార్మికుడు అదే వలకు బలై య్యాడు. ఈ ఘటన మండలంలోని అమడబాకుల గ్రామంలో చోటు చేసుకుం ది. గ్రామానికి చెందిన మత్స్యకార్మికుడు రామచంద్రయ్య సోమవారం తెల్లవా రుజామున ఊర చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. ఇంటికి తిరిగి రాకపో వడంతో అనుమానం వచ్చిన భార్య గోపాలమ్మ చెరువు వద్దకు వెళ్లి చూడగా బట్టలు కనిపించాయి. బంధువుల సహాయంతో చెరువులో గాలించగా, వలకు చుట్టుకొని మృతి చెందాడు. చెరువు నుంచి శవాన్ని బయటకు తీశారు.  భార్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశామని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై నాగశేఖర్‌రెడ్డి తెలిపారు. 



Updated Date - 2021-04-13T04:34:56+05:30 IST