Abn logo
Mar 2 2021 @ 23:20PM

డీ వార్మింగ్‌ డేను విజయవంతం చేయాలి : కలెక్టర్‌

నెల్లూరు(హరనాథపురం), మార్చి 2 : జిల్లాలో నులిపురుగుల నివారణ కార్యక్రమం (డీవార్మింగ్‌) బుధవారం ప్రారంభమవుతుందని, దీనిని విజయవంతం చేయాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం బంగ్లాలో ఆ కార్యక్రమంపై అధికారులతో సమీక్షించారు.   బాల స్వాస్థత కార్యక్రమంలో భాగంగా ఒకటి నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయాలని సూచించారు. ఈనెల 9వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.  ఈ సందర్భంగా డీవార్మింగ్‌ డే పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement