సమావేశంలో పాల్గొన్న ఛైర్మన భాగ్యలక్ష్మి, పాలక వర్గ సభ్యులు
డీసీఎంఎస్ ఛైర్మన భాగ్యలక్ష్మి
గుంటూరు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): వరి ధాన్యం కొనుగోళ్ళపై రైతుల్లో అవగాహన కల్పించాలని డీసీఎమ్‌ఎస్ ఛైర్మన యార్లగడ్డ భాగ్యలక్ష్మి ఆదేశించారు. గుంటూరులోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయం లో సోమవారం జరిగిన పాలకవర్గ సమావేశం జరిగింది. అధ్యక్షత వహించిన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, ప్రభుత్వం కనీస మద్దతుధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఈఏడాది డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 448 ఆర్బీకేలలో ధాన్య ం కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు చెప్పారు. ఆయా కేంద్రాలలో 47,132 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జీఎం హరగోపాల్ వివరించారు. సమావేశంలో పాలకవర్గ సభ్యులు కుర్రాపాములు, దాసరిరాజు, బాలగురవమ్మ, పాలవాయి ఆదినారాయణ, ఎమ్ క్రిష్ణారెడ్డి, వెంకటశివ, నిజాంపట్నం రైతు సలహా బోర్డు ఛైర్మన మదన తదితరులు పాల్గొన్నారు.