కొవిడ్‌ నియంత్రణకే పగటి కర్ఫ్యూ

ABN , First Publish Date - 2021-05-06T05:48:15+05:30 IST

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ వీరపాం డియన్‌, ఎస్పీ ఫక్కీరప్ప అధికారులను ఆదేశించారు.

కొవిడ్‌ నియంత్రణకే పగటి కర్ఫ్యూ

  1.  పకడ్బందీగా అమలు చేయాలి
  2. కలెక్టర్‌, ఎస్పీ ఆదేశాలు

    కర్నూలు(కలెక్టరేట్‌), మే 5:
    కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ వీరపాం డియన్‌, ఎస్పీ ఫక్కీరప్ప అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో బుధవారం కర్ఫ్యూ అమలు, నిత్యావసర సరుకుల పంపిణీపై కలెక్టర్‌, ఎస్పీ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌, ఎస్పీ మాట్లాడుతూ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే దుకాణాలకు అనుమతి ఉంటుందని, ఆ సమయంలో కూడా 144 సెక్షన్‌ అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. నంద్యాల, ఆదోని, కర్నూలు మార్కెట్లలో ఎక్కువ మంది గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కర్ఫ్యూ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి గుర్తింపు కార్డుతోపాటు వెహికల్‌ పాస్‌ ఇవ్వాలని అధికారులకు సూచించారు. నిత్యావసర సరుకులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని డోర్‌ డెలివరీ చేయించుకోవా లన్నారు. జిల్లాలో బెడ్స్‌ కొరత లేదని, ఇప్పటి వరకు 2,900 బెడ్లు ఉన్నాయని, కేసులు పెరిగే కొద్దీ మరిన్ని బెడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొవిడ్‌కు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదునైనా 104కు కాల్‌ చేసి చెప్పాలన్నారు. సమీక్షలో జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ, రైతు భరోసా) రాంసుందర్‌ రెడ్డి, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్‌ డీకే బాలాజీ, జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా, సంక్షేమం) శ్రీనివాసులు, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌, డీఆర్వో పుల్లయ్య పాల్గొన్నారు.

    సీనియర్లు వార్డులకు వెళ్లాల్సిందే..
    కర్నూలు(హాస్పిటల్‌), మే 5: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కొంతమంది సీనియర్‌ డాక్టర్లు కరోనా బాధితుల వార్డులకు వెళ్లడంలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ వీరపాండియన్‌ హెచ్చరించారు. బుధవారం కర్నూలు జీజీహెచ్‌లోని సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ను కలెక్టర్‌, ఎస్పీ ఫక్కీరప్ప అకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్‌ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.నరేంద్రనాథ్‌ రెడ్డి, ఏఆర్‌ఎంవో డా.వెంకటరమణ, డా.వై.ప్రవీణ్‌ కుమార్‌, మెడిసిన్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా.రవికళాధర్‌ రెడ్డి ఉన్నారు.




Updated Date - 2021-05-06T05:48:15+05:30 IST