దండారీ ఉత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-25T04:10:04+05:30 IST

దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి నది ఒడ్డున పద్మల్‌పూరీ కాకో ఆలయంలో ఆదివారం దండారి ఉత్సావాలు వైభవంగా ప్రారంభమయ్యాయి

దండారీ ఉత్సవాలు ప్రారంభం
:గుడిరేవు పద్మల్‌పూరీ కాకో ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్న గిరిజనులు

దండేపల్లి, అక్టోబరు 24: దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి నది ఒడ్డున పద్మల్‌పూరీ కాకో ఆలయంలో ఆదివారం దండారి ఉత్సావాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయం వద్ద ఎతైమాల్‌ పేన్‌ జెండాను ఆలయ నిర్వహక కమిటీ నాయకులు, గిరిజనులు ఆవిష్కరించి దండారి ఉత్సవాలను గిరిజన సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. యేటా దసరాకు మందు నుంచి దీపావళి వరకు రాష్ట్ర నలుమూల నుంచి గిరిజనులు కుటుంబసమేతంగా పద్మల్‌పూరీ కాకో ఆలయానికి వచ్చి అమ్మవారి దర్శించుకోని, ప్రత్యేక పూజలు చేయడం అనవాయితీ. ఆదివాసీ సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజతో పాటు కొత్త ధాన్యలతో కాకో అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం వండి సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నాయకులు, ఆదివాసీ, గిరిజన సంఘాల నాయకులు, గ్రామ పటేల్‌, గిరిజనులు పాల్గొన్నారు.   

Updated Date - 2021-10-25T04:10:04+05:30 IST