మర్కజ్ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్...11 రోజులు గ్రామం లాక్ డౌన్

ABN , First Publish Date - 2020-04-05T14:42:30+05:30 IST

దేశంలో కరోనా వైరస్ సంక్షోభం నిరంతరం పెరుగుతోంది. దీన్ని ఎదుర్కోవటానికి 21 రోజుల లాక్‌డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో ఒడిశాలోని

మర్కజ్ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్...11  రోజులు గ్రామం లాక్ డౌన్

పూరీ: దేశంలో కరోనా వైరస్ సంక్షోభం నిరంతరం పెరుగుతోంది. దీన్ని ఎదుర్కోవటానికి 21 రోజుల లాక్‌డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో ఒడిశాలోని పూరిలోని ఒక గ్రామాన్ని పూర్తిస్థాయిలో లాక్ డౌన్ చేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన జమాత్ కార్యక్రమం నుండి ఒక వ్యక్తి ఈ గ్రామానికి వచ్చాడు. వైద్య పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. పూరి జిల్లాలోని పిపిలి బ్లాక్‌లోని దానగోహిర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  దీనితో పూరి జిల్లా యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. కోవిడ్ -19 వ్యాప్తిని నివారించడానికి ఈ  ప్రాంతానికి సీలు వేసింది. ఈ సందర్భంగా పూరీ కలెక్టర్ బల్వంత్ సింగ్ మాట్లాడుతూ గ్రామాన్ని నియంత్రిత ప్రాంతంగా ప్రకటించామని చెప్పారు. ఇంతేకాకుండా గ్రామానికి ప్రక్కనే ఉన్న ప్రాంతాలైన దనగోహిర్ చాక్, జయపూర్ చాక్, జయపూర్ సాసన్ చాక్ కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త చర్యలు  తీసుకున్నామన్నారు. ఈ ప్రాంతాల్లో అన్ని రకాల కదలికలను నిషేధించామని జిల్లా యంత్రాంగం తెలిపింది.


Updated Date - 2020-04-05T14:42:30+05:30 IST