భయం.. భయంగా

ABN , First Publish Date - 2021-08-21T05:21:19+05:30 IST

బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన భవనాల్లోనే నేటికీ జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాల వరకు అనేక ప్రభుత్వ కార్యాలయాలు నడుస్తున్నాయి. కాలం చెల్లిన ఈ భవనా లను చూస్తేనే భయం వేస్తుంటుంది.

భయం.. భయంగా
వినుకొండ: ఈపూరు ఎంపీడీవో కార్యాలయం దుస్థితి

శిథిలావస్థలో ప్రభుత్వ కార్యాలయాలు

కాలం చెల్లిన భవనాల్లోనే ఉద్యోగుల విధులు

బ్రిటీష్‌ కాలంనాటి భవనాల్లోనే నేటికీ కార్యకలాపాలు

కాగితాలకే పరిమితమైన నూతన భవనాల ప్రతిపాదనలు 



గాలి.. వెలుతురే కాదు.. వర్షం పడితే నీరు, ఎండ కాస్తే భానుడి కిరణాలు.. ఆ భవనాల్లో దారాళంగా వస్తాయి. అదేంది ఆ భవనాలకు పైన కప్పు.. గోడలు లేవనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇవి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు. ఎప్పుడో బ్రిటీష్‌ హయాంలో కట్టిన భవనాల్లోనే నేటికీ పలు ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. మరమ్మతులు లేక.. నిర్వహణ మరిచిపోవడంతో ఆయా భవనాలు శిథిలమయ్యాయి. పెచ్చులు ఊడి పడే శ్లాబులు, పెంకులు.. కూలేందుకు సిద్ధంగా ఉన్న గోడలు.. వర్షం వస్తే రొచ్చురొచ్చుగా మారే గదుల్లోనే ఉద్యోగులు భయం భయంగా విధులు నిర్వహిస్తున్నారు. శిథిలమైపోయిన భవనాల్లోనే నేటికీ ప్రభుత్వ కార్యాకలాపాలు జరుగుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందోననే ఆందోళనల మధ్య ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. కాలం చెల్లిన భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్న విమర్శలు ఉద్యోగుల నుంచి వస్తున్నాయి. 


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన భవనాల్లోనే నేటికీ జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాల వరకు అనేక ప్రభుత్వ కార్యాలయాలు నడుస్తున్నాయి. కాలం చెల్లిన ఈ భవనా లను చూస్తేనే భయం వేస్తుంటుంది. అలాంటిది ఉద్యో గులు ఆయా భవనాల్లో విధులు నిర్వహిస్తుంటారు. గుం టూరుతో పాటు పలు ప్రాంతాల్లో భవనాలు శ్లాబులు ఊడి తృటిలో ఉద్యోగు లు ప్రమాదం నుంచి తప్పించు కున్న ఘటనలు అనేకం ఉన్నాయి.  ఓ మోస్తరు గాలి వీచినా.. భారీ వర్షం పడినా.. ఆయా కార్యాలయాల్లోని శ్లాబులు, పెంకులూడి పడటం సర్వ సాధారణంగా మా రుతుంది. ఇక వర్షం వస్తే నీరంతా భవనంలోకి చేరడం పరిపాటి. వర్షం నీటి లీకులు, తడిచిపోయి చెమ్మతో ఉన్న గోడల కారణంగా కలప, గోడలు దెబ్బతిని ఎప్పు డూ ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంతో అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. అనేక కార్యాలయాలు శిఽథిలమైనప్పటికీ తప్పని పరిస్థితులలో అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. వందేళ్లకు పైనుంచి ఎటువంటి మరమ్మతులకు నోచుకోని భవనాల్లోనే అనేక ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. సంబంధిత అధికారులు ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ పనులు విస్మరించటంతో వసతులు లేక  సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు పల్లంగా ఉండటంతో వర్షాకాలంలో నీరు లోపలికి ప్రవేశిస్తుంది.  ఏడాదికి ఒక సారైనా ప్రభుత్వకార్యాలయాలకు మరమ్మతులు, నిర్వ హణ పనులు జరగటంలేదని సిబ్బంది వాపోతున్నారు.  వర్షం పడితే విలువైన పత్రాలతో పాటు కంప్యూటర్లు తడవకుండా పట్టలు కప్పాల్సిన పరిస్థితి పలు కార్యాల యాల్లో నెలకొంది. నూతన భవనాలను నిర్మించాలని దశా బ్దాలుగా ఆయా ఉద్యోగులు కోరుతున్నారు. అయితే నూతన భవనాల నిర్మాణాల ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి.   బడ్జెట్‌ లేదని ఆయా ప్రతిపాదన లను తిప్పి పంపుతుండటం సర్వసాధారణంగా ఉంది. 

- బ్రిటీష్‌ వారి హయాంలో నిర్మించిన బాపట్ల తహసీల్దార్‌ కార్యాలయం, సబ్‌ట్రెజరి కార్యాలయం, రూరల్‌ పోలీసుస్టేషన్‌ భవనసముదాయాలు శిథిలావస్థకు చేరాయి. కురుస్తుండటంతో ఇటీవల పెంకులపై తారు అట్టలు వేశారు. సర్వేయర్‌, ఆర్‌ఐ కార్యాలయ భవనం కూడా శిఽథిలావస్థకు చేరింది. మున్సిపల్‌ కార్యాలయంలోని పాతభవన సముదాయం శిఽథిలమై ఏ క్షణానైన నేలకూలుతుందో అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయి. అయినా అధికారులు ఆ భవనాన్ని శానిటేషన్‌ కార్యాలయంగా విని యోగిస్తున్నారు. కర్లపాలెంలోని పశువైద్యశాల, చింతాయపాలెం జడ్పీ ఉన్నతపాఠశాల భవనం శిథిలమై ఉన్నాయి.   

 - మంగళగిరిలో 1916లో బ్రిటీషు పాలకులు నిర్మించిన భవనంలో నేటికీ తహసీల్దారు కార్యాలయం, ఉపఖజానా కార్యాలయం,  రూరల్‌ సర్కిల్‌ కార్యాలయం, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఈ భవన నిర్మాణం జరిగి వందేళ్లు దాటిపోవడంతో శిఽథిలావస్థకు చేరింది. తహసీల్దారు కార్యాలయానికి 2011-12లో రూ.4 లక్షలు వెచ్చించి మరమ్మతులను చేయించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిస్థితి దారుణంగా ఉంది. కంప్యూటరైజేషన్‌కు ముందుకాలం నాటి రికార్డులన్నీ తడిసి పాడైపోతున్నాయి. ఉపఖజానా కార్యాలయానికి మరమ్మతులు చేయించలేక  ఇబ్బందులు పడుతున్నారు. 



- పొన్నూరులోని సబ్‌ట్రెజరీ కార్యాలయం  పూర్తిగా శిఽథిలమవటంతో దానిని మూడేళ్లక్రితం ఎంపీడీవో కార్యాలయానికి తరలించారు. రూపురేఖలు మారిన పట్టణ పోలీస్‌స్టేషన్‌ కార్యాలయాన్ని రూరల్‌ సీఐ క్వార్టర్‌లో నిర్వహిస్తున్నారు. ఇక పట్టణ పోలీస్‌ స్టేషన్‌ కార్యాలయం నేలకూలడానికి సిద్ధంగా ఉంది. 1897లో నిర్మాణం చేసిన తహసీల్దారు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పైకప్పు పగిలిన పెంకుల రాలిపడుతున్నాయి. కార్యాలయాల్లోని విలువైన రికార్డులు తడుస్తున్నాయి.    

- తెనాలిలో ఆర్డీవో, తహసీల్దారు కార్యాలయాలు, పోలీస్‌ స్టేషన్ల భవనాలు మరమ్మతులు చేసి ఆధునీకరించగా, ఇంకా కొన్ని కార్యాలయాలు మాత్రం శిఽథిలావస్థకు చేరువలో ఉన్నా యి. సబ్‌ రిజిష్ర్టార్‌, ట్రెజరీ, మలేరి యా, ఫైలేరియా, డీడీవైఈవో కార్యాలయాలు శిథిలస్థితికి చేరాయి. వర్షం పడితే ఆ కార్యాలయాలు అంతా చిత్తడి చిత్తడిగా మారిపోతున్నాయి.  

- వినుకొండలోని తహసీల్దారు, సబ్‌ రిజిస్ర్టారు, ట్రెజరీ, ఎంపీడీవో కార్యాలయా లు బ్రిటీష్‌కాలంలో కట్టిన భవనాల్లోనే రోజు వారి కార్యాకలాపాలు జరుగుతున్నాయి. 1898 లో బ్రిటీష్‌ పాలకులు తహసీల్దారు కార్యాలయ ఆవరణలో సబ్‌రిజిస్ర్టార్‌, పోలీస్‌, ట్రెజరీ కార్యాల యాలను కలుపుతూ బిల్డింగ్‌ నిర్మించారు.  పోలీస్‌స్టేషన్‌ కొత్త బిల్డింగ్‌లోకి తరలించగా సబ్‌ రిజిస్ర్టార్‌, ట్రెజర్‌ కార్యాలయాలకు కొంత మర మ్మతులు చేపట్టారు. తహసీల్దారు కార్యాలయం పై పేర్చిన పెంకులు పగిలిపోయి ఎండ, వానకు అడ్డంలేకుండా ఉంది. వర్షం పడితే  సిబ్బంది కనీసం కూర్చునే పరిస్థితి లేదు.  ఈపూరు మం డల పరిషత్‌ కార్యాలయ భవనం బ్రిటీష్‌ కాలం నాటిది కావడంతో తరచూ పెచ్చులూడిపడి కం ప్యూటర్లు దెబ్బతింటున్నాయి.  

- తాడికొండలోని తహసీల్దార్‌ కార్యాలయం భ వనం శ్లాబు పెచ్చులు ఊడిపోవడంతో రెండేళ్ల క్రితం  మరమ్మతులు చేయించారు.  గతంలో నూతన భవనాన్ని నిర్మించడానికి సుమారు రూ.25 లక్షల వరకు నిధులు మంజూరు చేసినా వాటిని నరసరావుపేటకు మళ్లించారు. 40 ఏళ్ల క్రితం నిర్మించిన మండల పరిషత్‌ కార్యాలయం లోని వెలుగు విభాగం ఉన్న గదుల వద్ద వర్షం నీరు కారుతున్నది. పరిషత్‌ కార్యాలయ నూతన భవన నిర్మాణం ఐదేళ్లుగా సాగుతూనే ఉన్నది. 

- సత్తెనపల్లిలోని తహసీల్దారు , సబ్‌ట్రెజరీ కార్యాలయాలు పురాతన భవనాల్లో కొనసాగుతున్నాయి. వర్షాలు కురిస్తే సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో ఇబ్బందే. సబ్‌ ట్రెజరీ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి ఇటీవలే శంకుస్థాపన చేశారు. తహసీల్దారు కార్యాలయానికి నూ తన భవన నిర్మాణం 90 శాతం పూర్తి చేశారు. మండలంలోని పెదమక్కెనలో ఉన్న పశువైద్యశాల పాతభవనంలో కొనసాగుతుంది. నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామీణ పశువైద్యశాల వర్షం కురిస్తే వర్షపునీటిలో నిలిచిపోతుంది. ము ప్పాళ్లలోని విద్యావనరుల కేంద్రం భవనం వర్షాలకు కారుతుంటుంది.  రాజుపాలెంలోని సబ్‌ ట్రె జరీ కార్యాలయం వర్షాలు కురిస్తే భవనం  కారు తూ ఉంటుంది. 

-  గురజాల పాత తాలుకా కేంద్రంగా ఉన్న ప్పటి నుంచి తహసీల్దారు కార్యాలయం పురాత న భవనంలో కొనసాగింది. సుమారు 80ఏళ్ల  క్రితం నిర్మించిన భవనం పెంకులు పగిలిపోయి వర్షం వస్తే ముఖ్యమైన ఫైళ్లన్నీ తడిసిపోతు న్నాయి. సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం అద్దెభవనంలోనే కొనసాగుతుంది. పిడుగురాళ్ల తహసీల్దారు కార్యాలయం వర్షం కురుస్తూ ఉంటుంది. పిడుగురాళ్లలో సబ్‌ రిజిస్ట్రార్‌, రవాణాశాఖ కార్యాలయాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి.  

- తాడేపల్లి తహసీల్దారు కార్యాలయం శిథిలావస్థకు చేరుకుని దీనస్థితిలో కునారిల్లుతోంది. 1991లో ప్రారంభించిన ఈ భవనంలోని పలు గదుల్లో శ్లాబు పెచ్చులూడి ఇనుపచువ్వలు బయటకు కనిపిస్తున్నాయి. గోడలు పగుళ్లిచ్చి, పిచ్చి మొక్కలు మొలిచి కనిపిస్తున్నాయి. పిచ్చిమొక్కల మధ్యలో అధ్వానస్థితిలో కార్యాలయం ఉంది. గతంలో పాములు కూడా కార్యాలయంలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వచ్చే నెలలో మండల పరిఽషత్‌ కార్యాలయ భవనంలోకి తహ సీల్దారు కార్యాలయాన్ని మారుస్తామని తహసీల్దారు శ్రీనివాసులురెడ్డి తెలిపారు. 

- మాచర్లలోని ప్రభుత్వ కార్యాలయాలు పాత భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. బ్రిటీషు హయాం లో నిర్మించిన వీటికి మరమ్మతులు జరిపి  విధు లు కొనసాగిస్తున్నారు.  సబ్‌రిజిస్ట్రార్‌, మండల రెవెన్యూ, విద్యుత్‌ శాఖా కార్యాలయాల్లో వర్షం పడినప్పుడల్లా రికార్డులు తడిచిపోతున్నాయి. రె వెన్యూ కార్యాలయాన్ని దాతల సహకారంతో మ రమ్మతులు చేయించారు. విద్యుత్‌ శాఖ కార్యాల యాన్ని నూతన భవనంలోకి మార్చనున్నారు. 

-  యడ్లపాడు ఎస్సీకాలనీలో రెండు దశాబ్దాల కిందట నిర్మించిన పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉంది. యడ్లపాడులో జాతీయ రహదారి పక్కన నీటిపారుదలశాఖకు చెందిన గోడౌన్‌లు శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా ఉన్నాయి.  యడ్లపాడు మం డల విద్యావనరుల కేంద్రం లోతట్టులో ఉండటం తో కొద్దిపాటి వర్షానికే నీరు కార్యాలయంలోకి చే రుతోంది. చిలకలూరిపేట మండల వ్యవసాయశాఖ కార్యాలయం పాత మార్కెట్‌యార్డు ఆవరణలోని పాత భవనంలోనే కొనసాగుతుంది.  


  

Updated Date - 2021-08-21T05:21:19+05:30 IST