Abn logo
Aug 4 2021 @ 00:15AM

‘దళితబంధు’ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి

చౌటుప్పల్‌లో మాట్లాడుతున్న ఉబ్బు భిక్షపతి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ, ఎస్సీ మోర్చా సభ్యుడు భిక్షపతి

చౌటుప్పల్‌ టౌన్‌, భువనగిరి టౌన్‌, ఆగస్టు 3: దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు,  పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కమిటీ సభ్యుడు ఉబ్బు భిక్షపతి డిమాండ్‌ చేశారు. చౌటుప్పల్‌, భువనగిరిలో బీజేపీ కార్యాలయాల్లో మంగళవారం వేర్వేరుగా నిర్వహించిన సమావేశాల్లో వారు మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామమైన వాసాలమర్రి నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా దళితులకు ‘దళితబంధు’ను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని ప్రతీ దళిత కుటుంబానికి ఈ పథకాన్ని అమలు చేయాలన్నారు. సమావేశంలో కౌన్సిలర్‌ బండమీది మల్లేశం, బోయ లింగస్వామి, ఎర్ర గణేష్‌, బక్క పాండు పాల్గొన్నారు. 

భూదాన్‌పోచంపల్లి: ‘దళితబంధు’ పథకం తరహాలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం ‘చేనేతబంధు’ అమలు చేయాలని కాంగ్రెస్‌ చేనేత సంఘం జిల్లానేత తడ్క వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. భూదాన్‌పోచంపల్లిలో చేనేత కార్మిక సంఘం అధ్యక్షురాలు మెరుగు శశికళను సన్మానించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న రైతుబంధు, దళితబంధు తరహాలో చేనేతబంధు పథకం ప్రవేశపెట్టాలన్నారు. పేదలకు అందించే డబుల్‌బెడ్‌రూం చేనేత కార్మికులకు అందజేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు గునిగంటి రమేష్‌, మెరుగు శశికళ, నీలమ్మ, వెంకటే్‌షగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.