Abn logo
Aug 1 2021 @ 00:28AM

రాష్ట్ర వ్యాప్తంగా ‘దళితబంధు’ అమలు చేయాలి

సమావేశంలో పాల్గొన్న దళిత సంఘాల నేతలు

షెడ్యూల్డ్‌ కులాల సమగ్ర అభివృద్ధి కమిటీ డిమాండ్‌ 

జగిత్యాల అర్బన్‌, జూలై 31: హుజూరాబాద్‌ ఎన్నికల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ ప్రకటించిన దళిత బంధు పథకం నోటిఫికేషన్‌ కన్నా ముందే రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో అమలు చేయాలని జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని గెస్ట్‌ హౌజ్‌లో షెడ్యూల్డ్‌ కులాల సమగ్ర అభివృద్ది కమిటీ, ఎమ్మార్పీఎస్‌, మాల మహానాడు సంఘాల ఆధ్వర్యంలో షెడ్యూల్డ్‌ కు లాల సమగ్ర అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకుని ఎస్సీ కులాల సమగ్ర అభివృద్ధిపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ హుజూరాబాద్‌ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ప్రతి దళిత కుటుంబానికి రూ. 10లక్షలు అందించాలని డిమాండ్‌ చేశారు. ఆగస్టు 9న షెడ్యూల్డ్‌ కులాల సమగ్ర అభివృ ద్ధి కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహాధర్నాను నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో దళిత సంఘాల నాయకులు దుమాల గంగారాం మాదిగ, చిత్తారి ప్రభాకర్‌, శంకర్‌, సతీష్‌, లక్ష్మణ్‌, సతీష్‌, పాల్గొన్నారు.