దళితబంధు.. తొలి జాబితా సిద్ధం

ABN , First Publish Date - 2022-02-07T06:08:17+05:30 IST

దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు అ మలుకు జిల్లాలో మరో ముందడుగు పడింది.

దళితబంధు.. తొలి జాబితా సిద్ధం

ప్రత్యేక దృష్టి సారిస్తున్న కలెక్టర్‌ 

ఎమ్మెల్యేలకు కత్తిమీద సాములా ఎంపిక

జిల్లాలో తొలి దశలో 218 మందితో జాబితా


జగిత్యాల: దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు అ మలుకు జిల్లాలో మరో ముందడుగు పడింది. నియోజకవర్గానికి వంద మంది చొప్పున ఎంపిక చేసే జాబితాను అధికారులకు అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించింది. ఇప్పటికే జిల్లాలో తొలి దశ జాబితాను ఎమ్మెల్యేలు అధికారుల ద్వారా కలెక్టర్‌కు అందిం చారు. జిల్లాలోని ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలతో పాటు రెండేసి మండలాలను కలిగియున్న చొప్పదండి, వేములవాడ నియోజక వర్గాల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ప్రభుత్వం దళిత బంధు ప థకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ పథకం ద్వారా ఒక్కో దళిత కు టుంబానికి రూ. 10 లక్షల సాయం అందించాలని నిర్ణయించింది. ప్రభు త్వం సూచించిన 35 రకాల యూనిట్లలో ఏది ఉపయోగపడుతుందో దా న్ని ఎంచుకోవాలని అధికారులు నిర్ధేశిస్తున్నారు. మొదటగా హుజూరాబా ద్‌ నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది పథకాన్ని మరింత విస్తరించాలన్న లక్ష్యంతో ఒక్కో అసెంబ్లీ నియోజక వర్గంలో వంద మందికి ఇవ్వాలని నిర్ణయించింది. ఎమ్మెల్యేలే జాబితాల ను రూపొందించి అధికారులకు పేర్లను అప్పగించాలని సూచించింది.


వంద మందికి లబ్ధి

జిల్లాలో 218 మందితో దళిత బంధు తొలి జాబితా సిద్ధమైంది. ప్రభుత్వం సూచించిన విధంగా నియోజకవర్గానికి వంద మందికి లబ్ధి కల్పించడానికి ఎమ్మెల్యేలు కసరత్తులు పూర్తి చేస్తున్నారు. నియోజకవ ర్గాల్లో దళిత కుటుంబాలు అధిక సంఖ్యలో ఉండడం, పథకం తొలి దశ గా నియోజకవర్గంలో కేవలం వంద మందికి మాత్రమే అవకాశం కల్పి స్తుండడంతో ఎంపిక ఎమ్మెల్యేలకు కత్తిమీదిసాములా తయారయింది. అయినప్పటికీ ఎమ్మెల్యేలు ఆచితూచి ఎంపికలను పూర్తి చేసే పనుల్లో ఉన్నారు. జిల్లాలో ఇప్పటికే తొలి విడత జాబితాను ధర్మపురి నుంచి ప్రా తినిత్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌, జగిత్యాల, కోరుట్ల, చొప్ప దండి ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు, సుంకె రవి శంకర్‌లు అధికారుల ద్వారా కలెక్టర్‌కు అందించారు.  జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గ పరిధిలో 93, జగిత్యాల పరిధిలో 50, ధర్మపురి నియోజకవర్గంలో 45, చొప్పదండి పరిధిలో 30 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. 


అధికారుల క్షేత్ర స్థాయి పరిశీలన...

ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితా కలెక్టర్‌ కార్యాలయ అధికారులు ఆయా మండలాల అధికారులకు అందించారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ధర్మపు రి, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో అధికారుల పరిశీలన ప్రారం భించారు. మండల స్థాయిలో ప్రత్యేకాధికారి, ఎంపీడీవో, తహసీల్దార్‌ సం బంధించిన అధికారులు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను ధ్రువీకరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. లబ్ధిదారుల నుంచి వివరాలు సేకరించి అధికారులు నమూనాలు నమోదు చేస్తున్నారు.


బ్యాంకు ఖాతాలు ప్రారంభించడంపై దృష్టి..

దళితబంధు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు ప్రారంభించడానికి అధికా రులు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రతీ నియోజకవర్గానికి ఒక బ్యాంకు కేటాయించి, రానున్న రెండు రోజుల్లో ఖాతాలు ప్రారం భిం చడానికి అవసరమైన చర్యలు అధికారులు తీసుకుంటున్నారు. నూతన బ్యాంక్‌ ఖాతాలు ప్రారంభించే అంశంపై బ్యాంకర్లతో సమావేశం నిర్వ హించనున్నారు. ఖాతాల ప్రక్రియ పూర్తయిన తదుపరి యూనిట్లపై అవగాహన కల్పించనున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో అవగాహనశి బిరాలను నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. అందరూ ఒకే ర కమైన యూనిట్లు ఎంచుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని, ఒక్కొక్క రు ఒక్కో రకమైన యూనిట్‌ను తీసుకోవాలని సూచిస్తున్నారు. 


పకడ్బందీగా దళితబంధు అమలు

గుగులోతు రవి నాయక్‌, కలెక్టర్‌

జిల్లాలో పకడ్బందీగా దళిత బంధు పథకం అమలు చేయడానికి అ వసరమైన చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పటికే ఎమ్మెల్యేలు అందించి న జాబితాను పరిశీలిస్తున్నాము. జాబితా ఆధారంగా స్థానిక అధికారు లు క్షేత్ర స్థాయి పర్యటన నిర్వహించి వివరాలను సేకరిస్తున్నారు. ప్ర స్తుత ఆర్థిక సంవత్సరంలోనే దళిత బంధు యూనిట్లను గ్రౌండింగ్‌ చే యడానికి చర్యలు తీసుకుంటున్నాము.


సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకే...

- డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, ఎమ్మెల్యే, జగిత్యాల

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం మేరకు అన్ని నియోజక వర్గాల్లో దళిత బంధు పథకం అమలు చేయడానికి శాసన సభ్యులు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యం ప్రకారం జిల్లాలో దళిత బంధు సాయాన్ని అందించడానికి అవసరమైన కసరత్తులు చేస్తున్నాము. అ ర్హులకు అందేలా చర్యలు తీసుకుంటున్నాము. దేశంలోనే దళిత బంధు పథకం అత్యంత గొప్పదిగా మారనుంది.

Updated Date - 2022-02-07T06:08:17+05:30 IST