పేదరిక నిర్మూలన కోసమే దళితబంధు

ABN , First Publish Date - 2022-05-22T05:10:50+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపుతో వ్యవహరించి ఎస్సీల్లో పేదరిక నిర్మూలన కోసం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు.

పేదరిక నిర్మూలన కోసమే దళితబంధు
దళితబంధు పథకం కింద మంజూరైన వాహనాలను లబ్ధిదారులకు అందజేస్తున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

- ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి 

- లబ్ధిదారులకు వాహనాలు అందజేత


నాగర్‌కర్నూల్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపుతో వ్యవహరించి ఎస్సీల్లో పేదరిక నిర్మూలన కోసం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో దళితబంధు పథకం కింద మంజూరైన వాహ నాలను లబ్ధిదారులకు అందించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీ ఆర్‌ సంకల్పం సిద్దించాలంటే దళితబంధు పథకా న్ని సద్వినియోగం చేసుకొని జీవితాలను బాగు చేసుకోవాల్సిన గురుతరమైన బాధ్యత లబ్ధిదారుల పైనే ఉందన్నారు. 

 డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన

రూ.కోటీ 25లక్షల రూపాయల వ్యయంతో ఉయ్యాలవాడ సమీపంలో ఏర్పాటు చేయనున్న డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ భవన నిర్మాణానికి ఎమ్మె ల్యే మర్రి జనార్దన్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం శం కుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడు తూ కేసీఆర్‌ ప్రభుత్వ పాలనలో విద్య, వైద్య రం గాల్లో విప్లవాత్మకమైన మార్పులు సాధ్యమయ్యా యన్నారు. ప్రతీ ఒక్కరికి ఉచితంగా రోగనిర్దారణ పరీక్షలు చేసేందుకు ప్రభుత్వపరంగా ఏర్పాటుచే స్తున్న డయాగ్నోస్టిక్‌ సెంటర్లు దోహదపడుతా యన్నారు. నాగర్‌కర్నూల్‌కు వైద్య కళాశాల మం జూరు చేయించడం ఈ ప్రాంత ప్రజలు తన పట్ల చూపిన ఆదరాభిమానాలకు రుణం తీర్చుకో వడమేనని పేర్కొన్న ఆయన వచ్చే ఎన్నికల నా టికి తన ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చిన అం శాలను పూర్తి చేస్తానన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చై ర్మన్‌ మాధవరం హనుమంతురావు, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కల్పన, మార్కెట్‌ చైర్మన్‌ గంగనమోని కిరణ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఏఈ రాంలాల్‌, జిల్లా రవాణా శాఖ అధికారి ఎర్రిస్వామి,  సింగిల్‌ విం డో చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు శ్రీశై లం, ఎంపీపీలు పుప్పాల శ్రీనివాస్‌గౌడ్‌, శ్రీదేవి, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ దొడ్ల ఈశ్వర్‌రెడ్డి, టీఆర్‌ ఎస్‌ నాయకులు, కౌన్సిలర్లు ఖాజాఖాన్‌, ముస్తాక్‌ అహ్మద్‌, జక్కారాజు, బాదం సునీత పాల్గొన్నారు. 

 ప్రతీ ఒక్కరు దైవభక్తి కలిగి ఉండాలి

తిమ్మాజిపేట : ప్రతీ ఒక్కరు దైవభక్తి కలిగి ఉండాలని దైవభక్తి ద్వారానే మానసిక ప్రశాం తత చేకూరుతుందని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం మండలం లోని గొరిటలో బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత తిమ్మాజిపేటలో నిర్వహించిన బీరప్ప ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భం గా చౌడేశ్వరిదేవి విగ్రహాన్ని, ధ్వజస్తంభాన్ని వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య  ప్రతిష్ఠిం చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్య క్షుడు జోగుప్రదీప్‌, ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కిరణ్‌, ఆయా గ్రామాల సర్పం చ్‌లు, ఎంపీటీసీలు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పా ల్గొన్నారు. అదేవిధంగా, గొరిట గ్రామంలో నిర్వ హించిన బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవంలో తెలం గాణ డెంటల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డా.కూచ కుళ్ల రాజేష్‌రెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఆయన వెంట డా.కృష్ణచంద్ర ఉన్నారు. 

 సీఎం సహాయనిధితో ఎంతోమందికి మేలు

తెలకపల్లి : సీఎం సహాయనిధి ద్వారా ఎంతో మందికి ఆర్థిక సాయం అందించబడుతుందని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నా రు. మండలంలోని వట్టిపల్లి, గడ్డంపల్లి, పెద్దూరు, పర్వతాపూర్‌ గ్రామాలకు చెందిన నలుగురికి శనివారం హైదరాబాద్‌లో ఆయన క్యాంపు కార్యాలయంలో ఎల్‌వోసీని అందించారు. కార్యక్ర మంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నరేందర్‌ రెడ్డి, సర్పంచ్‌ లక్ష్మయ్య, నాయకులు మధు, శ్రీను తదితరులున్నారు. 

Updated Date - 2022-05-22T05:10:50+05:30 IST