బీజేపీ నేతలారా...ఆ పనిచేయొద్దు

ABN , First Publish Date - 2021-04-11T06:26:00+05:30 IST

ఆర్థిక వ్యవస్థకు, తద్వారా దేశానికి పట్టుకొమ్మలైన ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు పూనుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళిత, బహుజన, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని పలు సంఘాల ప్రతినిధులు దుయ్యబట్టారు.

బీజేపీ నేతలారా...ఆ పనిచేయొద్దు
అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ప్రతినిధులు

ఆర్థిక వ్యవస్థకు పునాది ప్రభుత్వ రంగ సంస్థలే

ప్రైవేటీకరణ వద్దంటూ దళిత విముక్తి విభాగం డిమాండ్‌

డాబాగార్డెన్స్‌, ఏప్రిల్‌ 10: ఆర్థిక వ్యవస్థకు, తద్వారా దేశానికి పట్టుకొమ్మలైన ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు పూనుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళిత, బహుజన, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని పలు సంఘాల ప్రతినిధులు దుయ్యబట్టారు.  ‘దళిత విముక్తి’ ఆధ్వర్యంలో శనివారం ఎల్‌ఐసీ భవనం అంబేడ్కర్‌ విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ‘ప్రతిఘటన’ ర్యాలీ నిర్వహించారు.


ఈ సందర్భంగా దళిత విముక్తి రాష్ట్ర కన్వీనర్‌ సుర్ల వెంకటరమణ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఏకైక లక్ష్యంగా బీజేపీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి మాట్లాడుతూ రిజర్వేషన్ల తొలగింపు లక్ష్యంగా సాగుతున్న చర్యలు రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. ఈ ర్యాలీలో భీమ్‌సేన్‌ అధ్యక్షుడు కె.చిన్నారావు, దళిత విముక్తి ప్రతినిధులు బి.అప్పారావు, బి.సన్యాసమ్మ, కుమార్‌, సూరప్పడు, లక్ష్మి, సారయ్య, రవి తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2021-04-11T06:26:00+05:30 IST