దళితబంధు ద్రోహి బీజేపీ

ABN , First Publish Date - 2021-10-20T04:47:47+05:30 IST

దళితబంధు ద్రోహి బీజేపీ అని అలంపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహాం అన్నారు.

దళితబంధు ద్రోహి బీజేపీ
అలంపూర్‌ చౌరస్తాలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అబ్రహాం

- ఈసీకి కేంద్రం లేఖ రాయడం వల్లే పథకం ఆగింది: ఎమ్మెల్యే అబ్రహాం

- కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

- అలంపూర్‌ చౌరస్తా, గద్వాలలో టీఆర్‌ఎస్‌ నాయకుల నిరసన

అలంపూర్‌ చౌరస్తా, అక్టోబరు 19:  దళితబంధు ద్రోహి బీజేపీ అని అలంపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం  అబ్రహాం అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాల యం నుంచి ఎమ్మెల్యే, కార్యకర్తలతో కలసి ర్యాలీగా వచ్చి అలంపూర్‌ చౌరస్తా కూడలిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ నాయకులు కేం ద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితబంధు పథకాన్ని పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద హుజూరాబాద్‌ నియోజకవర్గా న్ని ఎంచుకున్నందుకు బీజేపీ కుట్రపన్ని ఈసీకి లేఖరాసి పథకాన్ని నిలిపివేయించిందన్నారు. 70 ఏళ్లుగా దేశంలోని దళితులు నేటికి బాగుపడలేదన్నారు. రా ష్ట్రంలో ప్రతీ దళిత కుటుంబానికి రూ. 10లక్షలు ఇ వ్వాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం ముందుకు వెళ్తుంటూ ఓర్వ లేకనే ఈ పని చేశారని మండిపడ్డా రు. కేసీఆర్‌ ప్రవేశపెట్టే పథకాలను చూసి ఇతర రాష్ర్టాలే హర్షం వ్యక్తం చేస్తుంటే బీజేపీ మాత్రం కుట్ర ప న్నిందన్నారు.  హుజూరాబాద్‌ ఉప ఎన్నికను దృష్టి లో పెట్టుకొని ఈ ప థకాన్ని అమలు చేయలేదన్నారు.  ప్రజలు ఎప్పటికీ టీఆర్‌ఎస్‌ వెంటే ఉ న్నారని అన్నారు.ఎన్ని అడ్డంకులు సృ ష్టించిన దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్‌ అమలు చేస్తామని అన్నారు. బంగారు తెలం గాణ కేసీఆర్‌ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో అలం పూర్‌, వడ్డేపల్లి, అయిజ మునిసిపల్‌ చైర్‌పర్సన్లు మనోరమ, కరుణశ్రీ, దేవన్న, నాయకులు డాక్టర్‌ వీఎం అజయ్‌, బైరాపురం రమణ, కాశపోగు రాజు, కలుగొట్ల తేజ, నతనేలు, బొంకూరు శ్రీనువాసరెడ్డి, సింధనూరు, ఉప్పల ఎంపీటీసీ సభ్యులు రవి, ప్రహా ల్లద్‌రెడ్డి, కృష్ణగౌడ్‌, సుంకన్న, షేకుపల్లి మనోహర్‌రెడ్డి, మల్లికార్జున్‌, నరేంద్ర, కార్యకర్తలు పాల్గొన్నారు. 

 అక్కసుతోనే దళితబంధు పథకానికి బ్రేక్‌

 గద్వాల టౌన్‌: దళితులందరూ టీఆర్‌ఎస్‌ అండగా ఉన్నారనే అక్కసుతోనే హుజూరాబాదులో దళితబంధు పథకం అమలు కాకుండా కేంద్రంలోని బీజేపీ కుట్ర చేసిందని మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రామేశ్వరమ్మ ఆరోపించారు. నెలరోజుల క్రితమే ప్రారంభమైన దళితబంధు పథకాన్ని ఎన్నికల కోడ్‌ పేరుతో హుజూరాబాద్‌లో నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం దళితుల్లో ఆవేదనను మిగిల్చిందన్నారు. మంగళవారం దళిత ప్రజాప్రతినిధులు, నాయకులు, సంఘాల బాధ్యులతో కలిసి పట్టణంలోని  అంబేడ్కర్‌  విగ్రహాం ఎదుట ని రసన తెలిపి  అదనపు కలెక్టర్‌కు రఘురామ్‌శర్మకు వినతిపత్రాన్ని సమర్పించారు.  దళితులు ఆ ర్థికంగా ఎదగడం ఇష్టంలేని బీజేపీనాయకులు ఈసీకి ఫిర్యాదు చేసిన పథకాన్ని ఆపించడం శోచనీయమ న్నారు. బీజేపీకి హుజూరాబాద్‌ ఉపఎన్నికలో దళితు లు తగిన గుణపాఠం నేర్పాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ భాస్కర్‌, కౌన్సిలర్‌ మహేష్‌ కుమార్‌, సర్పంచ్‌ మన్యం, మాజీ ఎంపీ టీసీ ఎల్లప్ప, టీఆర్‌ఎస్‌ పట్టణ యూత్‌ అధ్యక్షుడు గంజిపేట మధు, ప్రవీణ్‌కుమార్‌, మహేష్‌, భీమన్న, విజయ్‌, జమ్మన్న, ఖాజన్న, సీనియర్‌ నాయకులు పూడూరు చిన్నయ్య, కురుమన్న, నరసింహా, అనీల్‌, హరీష్‌, రాజ్‌కుమార్‌, చిన్న, యాకూబ్‌, కృష్ణ ఉన్నారు. 





Updated Date - 2021-10-20T04:47:47+05:30 IST