Abn logo
Aug 23 2021 @ 12:01PM

హుజూరాబాద్‌లో దళితబంధు అమలుకు మరో రూ.500 కోట్లు

హైదరాబాద్‌: దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబడుతున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి  తెలంగాణ ప్రభుత్వం మరో రూ.500 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు సర్కార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇప్పటికే తొలి విడతగా రూ.500 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. హుజూరాబాద్‌లో దళిత బంధుకు మొత్తం రూ.వెయ్యి కోట్లు విడుదల చేసింది. వారం రోజుల్లో ప్రభుత్వం మరో రూ. వెయ్యి కోట్లు విడుదల చేయనుంది. 


కాగా హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు అమలు కోసం మొత్తం రూ. 2వేల కోట్ల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.