దాబాలు ఫుల్‌.. బార్లు నిల్‌!

ABN , First Publish Date - 2021-06-25T05:43:51+05:30 IST

జిల్లాలో జనాభా ఆధారంగా డివిజన్‌ కేంద్రాలు, మండలాలలో కొత్త బార్ల ఏ ర్పాటుకు నోటిఫికేషన్‌ వెలువడగా బార్లు ఏర్పాటు చేసేం దుకు వ్యాపారులు పెద్దగా ముందుకు రాలేదు.

దాబాలు ఫుల్‌.. బార్లు నిల్‌!

బార్లకు దరఖాస్తులు కరువు
దాబాలతో బార్ల ఆదాయానికి గండి
నష్టాలతో ముందుకు రాని వ్యాపారులు
పోలీసు, ఎక్సైజ్‌శాఖ చేతుల్లోనే బార్ల భవితవ్యం

బోధన్‌, జూన్‌ 24: రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎక్సైజ్‌ పాలసీ ప్రకారం ప్రతీ 25వేల జనాభాకు ఒక బార్‌ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగానే ప్రభుత్వం కొత్త బార్లకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. జిల్లాలో జనాభా ఆధారంగా డివిజన్‌ కేంద్రాలు, మండలాలలో కొత్త బార్ల ఏ ర్పాటుకు నోటిఫికేషన్‌ వెలువడగా బార్లు ఏర్పాటు చేసేం దుకు వ్యాపారులు పెద్దగా ముందుకు రాలేదు. బార్లను ఏ ర్పాటుచేసేందుకు ఒకప్పుడు పోటీ పడి గుడ్‌విల్‌ ఇచ్చి బా ర్లను పొందిన వ్యాపారులు ఇప్పుడు బార్లు ఏర్పాటు చేసేం దుకే సుముకత చూపడం లేదు. దీనికి అంతటికి కారణం దాబాలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లేనని ఎక్సైజ్‌శాఖ లెక్కలు చె బుతున్నాయి. విచ్చలవిడిగా ఏర్పాటైన దాబాలు పగలు, రాత్రి తేడా లేకుండా వాటిలో మద్యం సిట్టింగ్‌లు, సందట్లో సడేమియా అన్నట్టుగా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లోనూ సిట్టింగ్‌ రూంలను ఏర్పాటుచేసి మద్యం తాగిస్తుండడం బార్ల పైన తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రభుత్వం ఒకటి ఊహించి బార్ల నోటిఫికేషన్‌ జారీ చేయగా.. క్షేత్రస్థాయిలో మరో రక మైన పరిస్థితులున్నాయి. బార్ల నోటిఫికేషన్‌కు దరఖాస్తు లు రాకపోవడం ఎక్సైజ్‌శాఖను నివ్వెరపోయేలా చేస్తోంది.
 బోధన్‌లో మూడు బార్లకు మూడేసి దరఖాస్తులు
బోధన్‌లో మూడు కొత్తబార్లకు ఎక్సైజ్‌శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇప్పటికే ఒక బారు కొనసాగుతుండగా మరో మూడు బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్‌ విడుదలైంది. జనా భా లెక్కల ప్రకారం బోధన్‌ జనాభా లక్ష వరకు ఉంటుంద ని అంచనా. లక్ష జనాభాకుగానూ నాలుగు బార్లు ఉండాల్సి ఉంది. ఇందులో భాగంగానే ఎక్సైజ్‌శాఖ మరో మూడు కొత్త బార్లకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. అలాగే బాన్సువాడ, ఆ ర్మూర్‌, నిజామాబాద్‌, కామారెడ్డి పట్టణాలతోపాటు 25వేల పైన జనాభా ఉన్న మండల కేంద్రాలలోనూ బార్ల ఏర్పాటు కు ఎక్సైజ్‌శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ క్రమంలో బో ధన్‌లో ఒక్కో బారు ఏర్పాటుకు లైసెన్స్‌ ఫీజు ఒక్కో ఏడాది కి రూ.42లక్షల చొప్పున ఎక్సైజ్‌శాఖ విధించింది. కొత్త బారు ఏర్పాటు చేయాలంటే రూ.42లక్షలు ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది. ఇలా బోధన్‌లో మూడు బార్లకు నోటిఫికేషన్‌ జారీ కాగా ఒక్కో బారుకు మూడు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈ పరిస్థితులకు కారణమేమిటో అంచనా వేసే పనిలో ఎక్సైజ్‌శాఖ నిమగ్నమయ్యింది. కొన్ని చోట్ల బార్లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. భీమ్‌గల్‌లో ఒక్క బారుకు 50 దరఖాస్తులు రాగా.. బాన్సువాడలో ఒక్క బారుకు 60 పైనే దరఖాస్తులు వచ్చాయి. బోధన్‌ డివిజన్‌లో మాత్రం కొత్త బార్ల ఏర్పాటుకు దరఖాస్తులు రాకపోవడం ఎక్సైజ్‌శా ఖలో అంతర్మథనానికి కారణమయ్యింది. పదిశాతం లైసెన్స్‌ ఫీజు చెల్లించి బార్లను పొందాల్సిన వ్యాపారులు బార్లను తీ సుకునేందుకే ముందుకు రాకపోవడంతో ఎక్సైజ్‌శాఖలో గం దరగోళం నెలకొంది.
బార్ల ఆదాయానికి గండికొడుతున్న దాబాలు
నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల పరిధిలో దాబాలు విచ్చలవిడిగా వెలిశాయి. పట్టణాలు, పల్లెలు అంటూ తేడా లేకుండా గ్రామాల్లో వెలిసిన దాబాలు ఎక్సైజ్‌శాఖ ఆదా యానికి గండికొడుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకు ండానే అక్రమంగా కొనసాగుతున్న దాబాలు పగలు, రాత్రి తేడా లేకుండా మద్యం సిట్టింగ్‌లకు అడ్డాలుగా మారాయి. ప్రభుత్వానికి నయా పైసా చెల్లించకుండా దాబాలు, ఫా స్ట్‌ఫుడ్‌ సెంటర్‌లలో కొనసాగుతున్న మద్యం సిట్టింగ్‌లు బా ర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఎక్కడికక్కడ గ్రా మీణ ప్రాంతాల్లో దాబాలలోనే మద్యం సిట్టింగ్‌లు కొనసా గుతుండడంతో బార్లకు వచ్చి మద్యం తాగేవారు కరువ య్యారు. ఈ క్రమంలో పోలీసు, ఎక్సైజ్‌శాఖ చేతుల్లోనే బార్ల భవితత్వం ఆధారపడి ఉంది.
 బార్లకు దరఖాస్తులు రావడం లేదు..
- బాల్‌రాజ్‌, ఎక్సైజ్‌ సీఐ, బోధన్‌

బోధన్‌లో బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్‌ జారీ చేసినా దరఖాస్తులు పెద్దగా రాలేదు. జనాభా నిష్పత్తిన బోధన్‌లో మరో మూడు కొత్తబార్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయగా.. ఒక్కో బారుకు మూడు దరఖా స్తులు మాత్రమే వచ్చాయి. దాబాలలో మద్యం సిట్టింగ్‌లు కొనసాగుతుండడం వల్ల బార్లకు స్పందన రావడం లేదు. బార్లను కాపాడుకునేందుకు అనుమతులు లేని చోట మ ద్యం సిట్టింగ్‌లు కొనసాగిస్తే దాబాలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ల పై దాడులు తప్పవు. వాటి యజమానులపై కేసులు నమో దు చేస్తాం.

Updated Date - 2021-06-25T05:43:51+05:30 IST