చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కన్నుమూత

ABN , First Publish Date - 2020-11-20T09:37:31+05:30 IST

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీఏ సత్యప్రభ(70) గురువారం రాత్రి మరణించారు.

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కన్నుమూత

చిత్తూరు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీఏ సత్యప్రభ(70) గురువారం రాత్రి మరణించారు. గత నెల 10వ తేదీన ఆమెకు కరోనా వైరస్‌ సోకడంతో సొంత ఆస్పత్రి అయిన బెంగళూరులోని వైదేహీలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అప్పటి నుంచి ఐసీయూలో ఉన్న ఆమె ఆరోగ్య పరిస్థితి ఈ నెల 3వ తేదీ నుంచి విషమంగా మారడంతో వెంటిలేటర్‌ మీద ఉంచారు.చిత్తూరు జిల్లా సదుం మండలానికి చెందిన సత్యప్రభ 1951 సెప్టెంబరు 21న జన్మించారు. బెంగళూరులో మెట్రిక్యులేషన్‌ దాకా చదివారు.విద్యార్థిగా వున్నప్పటినుంచే ఆమె పుట్టపర్తి సాయిబాబాకు భక్తురాలు. చిత్తూరు షుగర్‌ ఫ్యాక్టరీలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న డీకే ఆదికేశవులుతో దగ్గరుండి ఆమె వివాహం జరిపించారు. అప్పటివరకు సాధారణ ఉద్యోగి, వ్యాపారవేత్తగా ఉన్న ఆదికేశవులు పెళ్లి తర్వాత పారిశ్రామికవేత్తగా ఎదిగారు. కాంగ్రెస్‌లో పేరున్న నాయకుడిగా ఎదిగిన ఆయన 2004లో టీడీపీ తరపున చిత్తూరు ఎంపీగా గెలిచారు. టీటీడీ ఛైర్మన్‌గా రెండుసార్లు పనిచేశారు.2009లో ఆదికేశవులు అనారోగ్యంతో మరణించాక గృహిణిగా ఉన్న సత్యప్రభ రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో టీడీపీ తరపున చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 

Updated Date - 2020-11-20T09:37:31+05:30 IST