రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు

ABN , First Publish Date - 2020-07-03T09:56:52+05:30 IST

కరోనా విస్తరిస్తున్న వేళ, సైబర్‌ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. బహుమతులు పంపుతామంటూ, ఓఎల్‌ఎక్స్‌లో వస్తువుల

రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు

గిఫ్ట్‌, ఓఎల్‌ఎక్స్‌, ఓటీపీ పేరుతో రూ. 20 లక్షలు స్వాహా


హైదరాబాద్‌ సిటీ, జూలై 2 (ఆంధ్రజ్యోతి): కరోనా విస్తరిస్తున్న వేళ, సైబర్‌ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. బహుమతులు పంపుతామంటూ, ఓఎల్‌ఎక్స్‌లో వస్తువుల కొనుగోళ్ల పేరుతో, ఓటీపీ మోసాలతో రూ. 20 లక్షలు కొల్లగొట్టారు. గిఫ్ట్‌, విదేశీ కరెన్సీ పంపుతున్నానంటూ ఓ మహిళ నుంచి రూ. 11 లక్షలు, ఓఎల్‌ఎక్స్‌, ఓటీపీ పేరుతో మరి కొందరినుంచి రూ. 9 లక్షలు కాజేశారు. యూకేలో మతబోధకుడిగా ఉన్నానంటూ నగరానికి చెందిన ఓ మహిళతో సైబర్‌ నేరగాడు పరిచయం చేసుకున్నాడు. ఆమెతో వాట్సా్‌పలో చాటింగ్‌ చేసేవాడు. ఇండియాలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని.. వారికి సాయం చేసేందుకు గిఫ్ట్‌లు, విదేఽశీ కరెన్సీ పంపుతున్నానని చెప్పాడు.


అనంతరం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ నుంచి కస్టమ్స్‌ అధికారులమంటూ ఫోన్‌ చేశారు. ఆమె ఆ గిఫ్ట్‌ తీసుకునేందుకు నిరాకరించగా.. వచ్చిన బహుమతులకు జీఎ్‌సటీ, కస్టమ్స్‌టాక్స్‌ కట్టకపోతే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని సైబర్‌ నేరగాళ్లు హెచ్చరించడంతో వారు సూచించిన ఖాతాకు రూ. 11 లక్షలు ఆన్‌లైన్‌లో బదిలీ చేసింది. ఆమె ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ రావడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది.  ఓఎల్‌ఎక్స్‌లో వస్తువుల పేరుతో, ఓటీపీ పేరుతో సైబర్‌నేరగాళ్లు పలువురి నుంచి రూ. 9 లక్షల వరకూ కాజేశారు. బాధితులందరూ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2020-07-03T09:56:52+05:30 IST