Abn logo
Oct 20 2021 @ 01:05AM

కోతల రాయుడు జగన: టీడీపీ

కుందుర్పిలో ఉమా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

గుంతకల్లు, అక్టోబరు 19: వ్యవసాయానికి విద్యుత కోతలు వి ధించిన సీఎం జగన కోతల రాయుడుగా మారాడని, కష్టాల్లో ఉన్న రై తులకు ఉరితాడునిస్తున్నాడని మాజీ శాసనసభ్యుడు ఆర్‌ జితేంద్రగౌ డు విమర్శించారు. మంగళవారం టీడీపీ నాయకులు మండలంలోని నల్లదాసరిపల్లి, పాతకొత్తచెరువు గ్రామాల్లో పర్యటించి రైతు సమావేశాలను నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన రైతులు, మహిళలతో మాట్లాడారు. జగన ప్రభుత్వ పరితీరు ఎలా ఉందని ప్రశ్నించారు. అ నంతరం జితేంద్రగౌడ్‌ మాట్లాడుతూ పింఛన్లు, రేషన కార్డులు మొదలుకుని కరెంటు వరకూ జగన అన్నింటిలోనూ కోతలు విధించాడన్నా రు. గత సంవత్సరం అతివృష్టితోనూ, ఈ సంవత్సరం అనావృష్టితోనూ  పంటలను పోగొట్టుకున్న రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ముఖం చాటేశారన్నారు. రైతులకు పరిహారాలు, బీ మానేకాదు కనీసం సబ్సిడీలు ఇవ్వాలన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేయడంలేదన్నారు. ఇప్పుడు పవర్‌ కట్‌తో రైతులకు కష్టాలు పెరిగాయన్నారు. భారీ బిల్లులు వస్తుండటంతో గృహస్థులు సైతం అల్లాడిపోతున్నారన్నారు. కరెంటు కోత లేని రాష్ట్రంలో పవర్‌ కట్‌ను జగన తె చ్చాడన్నారు. తమ నేత చంద్రబాబు రాషా్ట్రనికి అవసరమైన కరెంటు ను ఉత్పత్తి చేయడమేకాక, ఇతర రాషా్ట్రలకు అమ్మే స్థాయిలో మిగులు కరెంటును సాధించారన్నారు.


24 వేల మెగా వాట్ల కరెంటును ఉత్పత్తిచేసి కేంద్ర ప్రభుత్వ ప్రశంసలందుకున్నారన్నారు. రోజులు గడచేకొ ద్దీ జగన అసమర్థ పరిపాలనతో రాషా్ట్రన్ని అధోగతి పాల్జేస్తున్నాడన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను అవగతం చేసుకుని రా నున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును గెలిపించాలని సూచించా రు. కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ రాయల రామయ్య, టీడీపీ పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి జీ వెంకటేశులు, సింగిల్‌విండో సొసై టీ మాజీ అధ్యక్షుడు పాల మల్లికార్జున, మాజీ ఎంపీటీసీ సభ్యుడు త లారి మస్తానప్ప, బీసీ సెల్‌ రాస్ట్ర నాయకుడు గాలి మల్లికార్జన, తదితరులు పాల్గొన్నారు. 


తుగ్లక్‌ పాలనకు చరమగీతం పాడుదాం : పరిటాల శ్రీరామ్‌ 

కుందుర్పి : రాష్ట్రంలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పిచ్చి తుగ్లక్‌ పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ యువ నాయకుడు పరిటాల శ్రీరామ్‌ పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని కెంచంపల్లిలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మిగులు విద్యుత సరఫరా అవుతుంటే... ప్రస్తుత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో  లోటు విద్యుత రాష్ట్రంగా మిగిల్చారని దుయ్యబట్టారు. టీడీపీ హ యాంలో యూనిట్‌ ధర రూ.4.50లు వుండగా, ఇప్పుడు ఇతర రాషా్ట్రల నుంచి రూ.26లకు పైగా యూనిట్‌ ధరతో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రైతులు ఏర్పాటు చేసుకుంటున్న విద్యుత మో టార్లకు మీటర్లు బిగించే పద్ధతిని తీసుకువస్తే రైతుల పరిస్థితి ఏమిట ని ప్రశ్నించారు. ఒక రైతుకు 6 వేలకు పైగా విద్యుత చార్జీలు చెల్లించే పరిస్థితి లేకపోలేదన్నారు. ఇలాగే కొనసాగితే వెనుకబడిన అనంతపు రం జిల్లా రైతుల పరిస్థితి మరింత దయనీయమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హ నుమంతరాయచౌదరి, సీనియర్‌ నాయకులు చౌళం మల్లికార్జున, ప్ర భాకర్‌చౌదరి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామ్మోహనచౌదరి, తెలు గు రైతు రాష్ట్ర కార్యదర్శి లక్ష్మినారాయణ, అనంతపురం పార్లమెంట్‌ ఉపాధ్యక్షులు వైపీ రమేష్‌, మాజీ మండల కన్వీనర్‌ మల్లికార్జున, మా జీ వైస్‌ ఎంపీపీ గోళ్ల వెంకటేశులు, మారుతిచౌదరి, ఊటంకి రామాంజినేయులు, కంబదూరు ఎర్రిస్వామి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు కొల్లాపురప్ప, గౌని శ్రీనివాసరెడ్డి, తెలుగు మహిళ అధ్యక్షురాలు ప్రియాంక, మాజీ మండల కన్వీనర్‌ కేపీ రామాంజనేయులు, సర్మ్‌సవలీ, వెలుగు లోకేష్‌, సాయినాథ్‌ పాల్గొన్నారు. 


జగన స్వలాభం కోసమే రైతుల నడ్డివిరుస్తున్నారు : ఉమా

కుందుర్పి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి స్వలాభం కోసమే  రైతుల నడ్డి విరుస్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ మాదినేని ఉమామహేశ్వరనాయుడు విమర్శించారు. మండల కేంద్రంలో మంగళవారం విద్యుత కోతలకు నిరసనగా రైతులు, పార్టీ శ్రేణులతో కలసి ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్నాల పేరిట అన్ని వర్గాల ప్రజలను దగాచేసిన ఘనత జగన ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ప్రజల కోసం ప్రవేశపెట్టిన ప్రతి పథకంలోను ఆ యన స్వలాభం కోసమే తప్ప ప్రజలకు మేలు లేదన్నారు. ప్రభుత్వం పనితీరు అగమ్యగోచరంగా వుందన్నారు. నవ్యాంధ్రప్రదేశను కరెంట్‌ కోతల రాష్ట్రంగా మిగిల్చిన ఘనత జగన్మోహనరెడ్డికే దక్కుతుందన్నా రు. తెలుగుదేశం హయాంలో మిగులు విద్యుత సాధించిన ఘనత  చంద్రబాబుకే దక్కిందన్నారు. ప్రస్తుత సోలార్‌, గాలిమరల ద్వారా అ ధిక విద్యుత ఉత్పత్తి చేసినా విద్యుత కోతలు విధించడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్యక్రమంలో మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన దొడగట్ట నారాయణ, పార్లమెంట్‌ కార్యదర్శి  తలారి సత్యప్ప, మండల కన్వీనర్‌ ధనుంజయ, పట్టణ కన్వీనర్‌ ము రళి, మాజీ మండల కన్వీనర్‌ శ్రీరాములు, మాజీ సర్పంచు పెద్ద నరసింహప్ప, మాజీ వైస్‌ ఎంపీపీ రవి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మల్లికార్జున, శ్రీనివాసులు, వెట్టి హనుమంతరాయుడు పాల్గొన్నారు.