పెళ్లిలో వధువు కునికిపాట్లు.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు!

ABN , First Publish Date - 2021-12-18T21:51:22+05:30 IST

హిందూ సాంప్రదాయంలో చాలా వివాహాలు రాత్రి సమయాల్లోనే జరుగుతాయి.

పెళ్లిలో వధువు కునికిపాట్లు.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు!

హిందూ సాంప్రదాయంలో చాలా వివాహాలు రాత్రి సమయాల్లోనే జరుగుతాయి. పెళ్లి తంతు రాత్రి మొదలై ఉదయం వరకు కొనసాగుతుంటుంది. మధ్యమధ్యలో బంధువులు కొంత సేపు నిద్రపోతారు. వధూవరులు మాత్రం ఆ రాత్రంతా నిద్రకు దూరం కావాల్సిందే. దీంతో నిద్ర కళ్లతోనే పెళ్లి పీటల మీద కూర్చుంటారు. ఓ పెళ్లిలో వధువు కునికిపాట్లకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  


పట్టుచీర, నగలు ధరించి చక్కగా ముస్తాబై సోఫాలో కూర్చున్న వధువు కునికిపాట్లు పడుతుండడం ఆ వీడియోలో కనిపిస్తోంది. పక్కనే వరుడు నిల్చుని వేరెవరితోనో మాట్లాడుతున్నాడు. ఈ ఘటనను ఆమె స్నేహితులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. `నిద్రపోతున్న వధువు. ఉదయం 6.30 గంటలైనా పెళ్లి జరుగుతూనే ఉంద`ని కామెంట్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది `క్యూట్` అని కామెంట్ చేశారు. `నా పెళ్లిలో నేనూ అలాగే చేశాన`ని ఓ మహిళ కామెంట్ చేసింది. 



Updated Date - 2021-12-18T21:51:22+05:30 IST