కర్ఫ్యూ నిబంధనలు పాటించాల్సిందే : ఎస్పీ

ABN , First Publish Date - 2020-05-29T09:54:31+05:30 IST

లాక్‌డౌన్‌ సమయంలో కర్ప్యూ నిబంధనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ రాజకుమారి తెలిపారు.

కర్ఫ్యూ  నిబంధనలు పాటించాల్సిందే : ఎస్పీ

విజయనగరం క్రైం, మే 28: లాక్‌డౌన్‌ సమయంలో కర్ప్యూ నిబంధనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని  ఎస్పీ రాజకుమారి తెలిపారు. గురువారం నగరంలోని అంబేడ్కర్‌ కూడలి, పీడబ్ల్యూ మార్కెట్‌, రాజీవ్‌క్రీడా మైదానం, దాసన్నపేట జంక్షన్‌ ప్రాంతాలను సందర్శించి భద్రతను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యాపారాలు సాగించే వారికి, కొనుగోలు దారులకు   మాస్క్‌ల ప్రాధాన్యం తెలియజేయాలని సిబ్బందికి సూచించారు.  కర్ఫ్యూ సమయంలో ప్రజలెవరూ బయటకు రావద్దన్నారు. దుకాణాలు మధ్యా హ్నం 1 గంటకు మూసివేయాలన్నారు. ఎక్కువ మందితో ప్రయాణించే వాహనాలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.


అంతర్‌ జిల్లా చెక్‌పోస్టు వద్ద  వ్యక్తుల వివరాలు నమోదు చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించారు.    అంబేడ్కర్‌ జంక్షన్‌లో ఆటోడ్రైవర్లకు శానిటైజర్లు, మాస్క్‌లు అందించారు. ట్రాఫిక్‌ డీఎస్పీ మోహనరావు, సీఐలు ఎర్రంనాయుడు, శ్రీహరిరాజు  పాల్గొన్నారు.  ఫ బొబ్బిలి:  స్థానిక తాండ్రపాపారాయ ఇంజనీరింగ్‌ కళాశాలలో   క్వారంటైన్‌ కేం ద్రాన్ని ఎస్పీ పరిశీలించారు. అనంతరం బొబ్బిలి పోలీస్‌ స్టేషన్‌లో ఇన్‌చార్జి డీఎస్పీ పాపారావు, సీఐ కేశవరావుకు, డివిజన్‌ స్థాయి పోలీసులకు టోపీలు అందించారు. ఫ సీతానగరం:  జోగింపేటలోని బాలయోగి గురుకుల పాఠశాలలో క్వారంటైన్‌ కేంద్రాన్ని  ఎస్పీ పరిశీలించారు.  సీఐ ప్రసాద్‌, ఎస్‌ఐ లోవరాజు, తహసీల్దార్‌ రామస్వామి ఉన్నారు. పార్వతీపురం మండలం వెంకంపేట వద్ద చెక్‌పోస్టును పరిశీలించి పోలీసులకు టోపీలు, శానిటైజర్స్‌ను  పంపిణీ చేశారు. 

Updated Date - 2020-05-29T09:54:31+05:30 IST