త్వరగా పూర్తి చేయండి

ABN , First Publish Date - 2021-02-25T04:47:31+05:30 IST

సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయ భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదే శించారు.

త్వరగా పూర్తి చేయండి
నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌

- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌

- సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనుల పరిశీలన


మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌)/భూత్పూర్‌,  ఫిబ్రవరి 24 : సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయ భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదే శించారు. మహబూబ్‌నగర్‌ మునిసిపాలిటీ పరిధిలోని పాలకొండ సమీపంలో నిర్మాణంలో ఉన్న జి ల్లా నూతన కలెక్టర్‌ కార్యాలయ భవన నిర్మాణ పనులను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఛాంబర్‌, సమావేశ మందిరం, వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌, జిల్లా అ ధికారుల గదులు, వాహన పార్కింగ్‌, మొదటి, రెండో అంతస్తులో నిర్మిస్తున్న గదులను పరి శీలించారు. ఆర్‌అండ్‌బీ అధికారులు, కాంట్రాక్టర్‌ వివరాలను కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావును అడిగి తె లుసుకున్నారు. ఆయన వెంట ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌, డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, అదనపు కలెక్టర్లు సీతారామారావు, తేజస్‌ నంద లాల్‌ పవర్‌ ఉన్నారు.



కాగా, నూతన కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులు పరిశీలించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి కలెక్టర్‌తో కలిసి భూత్పూర్‌ మండలం పోతులమడుగు గ్రామాన్ని సందర్శించారు.


ఈ సందర్భంగా గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. అనంతరం మొక్కను నాటి నీళ్లు పో శారు. ఈ సందర్భంగా పల్లె ప్రకృతి వనాల్లో ఎన్ని మొక్కలు నాటారు.? ఎంత స్థలంలో ఉంది? గ్రా మస్థులు నడక కోసం వస్తున్నరా? లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర ఎకరంలో ఏర్పాటు చేశామని, రెండు వేల మొక్కలు నాటామని వివరించారు. ఆయన వెంట జిల్లా పంచా యతీ రాజ్‌ అధికారి వెంకటేశ్వర్లు, డీఆర్‌డీవో వెంకట్‌రెడ్డి, ఏపీడీ జకియాస్తుల్తానా, ఎంపీడీవో ము న్ని, సర్పంచ్‌ కమలమ్మ, ఎంపీవో విజయ్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - 2021-02-25T04:47:31+05:30 IST