వీఐపీల భద్రత కోసం మహిళా కమాండోలు

ABN , First Publish Date - 2021-12-24T00:29:21+05:30 IST

వీఐపీల భద్రత కోసం మహిళా కమాండోలు

వీఐపీల భద్రత కోసం మహిళా కమాండోలు

న్యూఢిల్లీ: వీఐపీల భద్రత కోసం ఇప్పుడు కొత్తగా మహిళా కమాండోలను కేంద్ర ప్రభుత్వం నియమించనుంది. వీఐపీ భద్రత కోసం శిక్షణ పొందిన సీఆర్పీఎఫ్ మహిళా కమాండోలను త్వరలో హోంమంత్రి అమిత్ షాతో సహా ఢిల్లీలో ఉన్న జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ వాద్రా, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు నియమించనున్నారు. పర్యటనలు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం కూడా సీఆర్పీఎఫ్ మహిళా కమాండోలు వీఐపీలకు సెక్యూరిటీగా విధులు నిర్వహించనున్నారు. తొలిసారిగా సీఆర్పీఎఫ్ 32 మంది మహిళలతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. 10 వారాలు శిక్షణ పొందిన సీఆర్పీఎఫ్ మహిళా కమాండోలు వీఐపీలకు సెక్యూరిటీగా నియమించనున్నారు. మహిళా కమాండోలకు ప్రత్యేక ఆయుధాలు అందుబాటులో ఉంటాయి. జనవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. జెడ్ ప్లస్ భద్రత ఉన్న వారికీ మహిళా కమోండోలను రొటేషన్ పద్ధతిలో నియమించనున్నట్లు తెలుస్తోంది. రానున్న నెలల్లో యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనవరి నుంచే సీఆర్పీఎఫ్ మహిళా కమాండోలు వీఐపీలకు సెక్యూరిటీగా అందుబాటులోకి రానున్నారు.

Updated Date - 2021-12-24T00:29:21+05:30 IST