ఆలయ క్యూలైన్లలో స్వామి దర్శనార్థం వేచి ఉన్న భక్తులు
ఐరాల(కాణిపాకం), మే 21: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శనివారం భక్తుల రద్దీతో కిటికిటలాడింది. ఉదయం నుంచి స్వామి దర్శనార్థం వేలాదిగా భక్తులు ఆలయానికి విచ్చేశారు. దీంతో ఆలయ క్యూలైన్లు పూర్తిగా నిండి పోయి స్వామి దర ్శనానికి సుమారు మూడు గంటల సమయం పట్టింది. క్యూలైన్లలో భక్తుల మధ్య ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. క్యూలైన్లలో భక్తుల దాహార్తిని తీర్చడానికి తాగునీరు, మజ్జిగ ను అందించారు.